
పాట్నా: పాట్నాలోని దానపూర్ ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన ఒక వ్యాన్ దానపూర్ ప్రాంతంలోని పాంటూన్ వంతెనపై నుంచి గంగా నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు. అఖీపూర్‌లో ప్రాంతంలోని పీపా పుల్‌ను దాటుతుండగా 13 మంది వ్యక్తులతో ఉన్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో గంగా నదిలోకి దూసుకెళ్లింది. నలుగురుకి ఈత రావడంతో వారు ప్రాణాలు దక్కించుకోగా, మిగతా తొమ్మిది మంది అక్కడే మరణించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. అఖీపూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 07.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దనాపూర్లోని చిత్రకూట్‌నగర్‌కు చెందిన ఓ ఫ్యామిలీ అఖీపూర్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యి తిరిగి సొంతూరి పయనమయ్యారు. నదిలో పడిపోయిన వ్యాన్‌లో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 13 మంది ఉన్నారు. ఐతే పీపాపుల్ బ్రిడ్జిపైకి చేరుకోనే వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అనంతరం ఆ వ్యాన్ నేరుగా నదిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బృందాలు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నదిలోకి దిగి గాలించగా 9 మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేల్ చంద్రశేఖర్ సింగ్ ప్రకటించారు. బిజెపీ లోక్‌సభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి రామ్‌క్రీపాల్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment