సాక్షి, వైఎస్సార్ జిల్లా : పులివెందుల మున్సిపాలిటీ భాకరపురంలోని వైఎస్ ప్రతాప్‌రెడ్డి కార్యాలయంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని విచారించారు. పేలుడు పదార్థాలపై ఆరా తీశారు. పేలుడు పదార్థాలను ఎలా నిల్వ చేస్తారు.. ఎక్కడి నుంచి తెస్తారు.. ఎవరికి అమ్ముతారు.. ఇటీవల ఎవరెవరికి అమ్మారు లాంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఈనెల 8న మామిళ్లపల్లి క్వారీ వద్ద జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గని లీజుదారుడు నాగేశ్వర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈనెల 11న ప్రతాప్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన్ని కోర్టులో హాజరు పర్చగా కోర్టు రిమాండ్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment