
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఆటోనగర్ కు చెందిన ఫయాజ్ అనే ఏడేళ్ల బాలుడిని కాళ్ళు, చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. దుండగులు దారుణహత్య చేశారు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని నిజాంసాగర్ కెనాల్లో పడేశారు.
వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం నుంచి ఫయాజ్ కనించకుండా పోవడంతో సోషల్ మీడియాలో ఫయాజ్‌కు సంబంధించిన వార్త వైరలైంది. అయితే శనివారం నిజాంసాగర్ కెనాల్ లో ఫయాజ్ విగతజీవిగా ప్రత్యక్షమయ్యాడు.అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు నిర్జీవంగా కెనాల్‌లో చూసేసరికి బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమకు ఎవరితో పాత కక్షలు కూడా ఏమీ లేవని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దారుణం వెనుక కారణమేమిటి.. అభం శుభం ఎరుగని బాలుడిని హత్య చేసిందెవరనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
చదవండి: ఇన్‌స్టాలో పరిచయం.. ప్రేమ.. చెల్లి పెళ్లిలో ఇంట్లో వాళ్లకు పరిచయం.. చివరికి!
Comments
Please login to add a commentAdd a comment