
మృతి చెందిన విజయలక్ష్మి
వైఎస్‌ఆర్ జిల్లా,లక్కిరెడ్డిపల్లె : టీవీ రిమోట్ కోసం అక్క, తమ్ముడు గొడవ పడ్డారు. ‘పెద్దదానివి అలా చేస్తే ఎలా’ అని తల్లి మందలించింది. దీంతో మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాళెంగొల్లపల్లె పంచాయతీ దళితవాడకు చెందిన రామకృష్ణ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. ఆయన కుమార్తె విజయలక్ష్మి (17)çహార్టికల్చర్‌లో ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. బుధవారం రాత్రి టీవీ రిమోట్ విషయంలో అక్క, తమ్ముడు గొడవ పడ్డారు. విజయలక్ష్మిని తల్లి మందలించింది. బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. ఈ సంఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment