TV remote
-
‘పెద్దదానివి అలా చేస్తే ఎలా’..
వైఎస్ఆర్ జిల్లా,లక్కిరెడ్డిపల్లె : టీవీ రిమోట్ కోసం అక్క, తమ్ముడు గొడవ పడ్డారు. ‘పెద్దదానివి అలా చేస్తే ఎలా’ అని తల్లి మందలించింది. దీంతో మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాళెంగొల్లపల్లె పంచాయతీ దళితవాడకు చెందిన రామకృష్ణ మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్నారు. ఆయన కుమార్తె విజయలక్ష్మి (17)çహార్టికల్చర్‌లో ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. బుధవారం రాత్రి టీవీ రిమోట్ విషయంలో అక్క, తమ్ముడు గొడవ పడ్డారు. విజయలక్ష్మిని తల్లి మందలించింది. బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. ఈ సంఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
టీవీ చానల్ మార్చే విషయంలో గొడవ
నల్లగొండ క్రైం: టీవీ చానల్ మార్చే విషయంలో తండ్రీకుమారుడి మధ్య జరిగిన గొడవ తండ్రి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఉన్న కుమారు డు రోకలిబండతో తండ్రి తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పట్టణంలోని ప్రకాశం బజార్లో నివాసముంటున్న పెరుమాళ్ల గోవర్ధన్ (65) గురువారం రాత్రి భక్తి టీవీ చానెల్ చూస్తున్నాడు. అదే సమయంలో కుమారుడు సతీశ్ ఆ చానల్‌ను మార్చాలని, తాను టీవీ చూడాలని రిమోట్‌ను తండ్రి చేతుల్లోనుంచి లాక్కున్నాడు. తండ్రి గోవర్ధన్ కూడా తాను భక్తి చానల్ చూడాలని కుమారుడిచేతుల్లో నుంచి రిమోట్‌ను తిరిగి లాక్కున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీశ్ రోకలిబండ తీసుకుని టీవీని ధ్వంసం చేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన తండ్రి.. తన కుమారుడి గల్లా పట్టుకున్నాడు. సతీశ్ చేతిలో ఉన్న రోకలిబండతో తండ్రి తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమార్తె జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వన్‌టౌన్ సీఐ సురేశ్ తెలిపారు. -
క్షణికావేశంలో కఠిన నిర్ణయం!
అల్లిపురం(విశాఖ దక్షిణ): టీవీలో చానల్ మార్చడంలో తండ్రి, కూతురు మధ్య జరిగిన గొడవ ఆ తండ్రి ప్రాణాల మీదకు తెచ్చింది. పిల్లలతో సర్దుకుపోవాల్సిన పెద్దాయన క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేశారు. మనస్తాపంతో తండ్రి బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహారాణిపేట పరిధి, కృష్ణానగర్‌లో నక్కా కొండలరావు(52) తన కుటుంబంతో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూమార్తె సాయి ప్రశాంతితో కలిసి కొండలరావు టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో తండ్రీ కుమార్తెకు మధ్య టీవీ చానల్ మార్పు విషయంలో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొండలరావు మనస్తాపంతో గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అనంతరం ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా తలుపుల తీసి చూశారు. అప్పటికే ఆయన తాడుతో ఇంటిపై కప్పుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు మృతదేహాన్ని దించి గుట్టుగా అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసి జ్ఞానాపురంలోని హిందూ శ్మశానవాటికకు తరలించారు. అక్కడి శ్మశానవాటిక సిబ్బంది మృతదేహం మెడ భాగంలో తాడు బిగుసుకున్న గుర్తులు గుర్తించారు. దీంతో వారు శ్మశానవాటిక ఇన్‌ఛార్జి ప్రసన్నకుమార్‌కు తెలియజేయటంతో ఆయన మహారాణిపేట పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్ఐ రామకృష్ణ శ్మశాన వాటికకు వచ్చి కుటుంబ సభ్యులుతో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిమోట్ చోరీకి అంత పెద్ద శిక్షా!
వాషింగ్టన్: ఎన్నో చోరీలు చేశాడు కానీ ఇలాంటి శిక్ష అతడు ఎప్పుడూ అనుభవించి ఉండడు. టీవీ రిమోట్ చోరీ చేసిన ఓ వ్యక్తికి స్థానిక మేజిస్ట్రేట్ ఏకంగా 22ఏళ్ల జైలుశిక్ష విధించారు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఈ ఘటన అమెరికాలోని చికాగో సిటీలో ఇటీవల చోటుచేసుకుంది. గతంలో అతడు చేసిన తప్పిదాలను లెక్కలోకి తీసుకుంటే అతడికి 30 ఏళ్ల వరకు శిక్ష వేయవచ్చు అంటూ చికాగో ట్రిబ్యునల్ లో సీనియర్ న్యాయవాది రాబర్ట్ బెర్లిన్ తన వాదన వినిపించారు. చివరికి 22 ఏళ్ల శిక్ష ఖరారు చేశారు. ఎరిక్ బ్రామ్‌వెల్(35) చికాగోలో నివాసం ఉంటున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా అతడు పలుమార్లు చోరీలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట చికాగోలోని మెల్ రోస్ పార్క్ ఏరియాలో 100 బ్లాక్ ఆఫ్ క్రాస్ స్ట్రీట్‌లో ఓ అపార్ట్ మెంట్లో ప్రవేశించాడు. అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్‌లో టీవీ రిమోట్‌ను చోరీ చేసిన ఎరిక్ ఎలాగోలాగ అక్కడినుంచి తప్పించుకున్నాడు. తరచుగా ఇలాంటి చోరీలకు పాల్పడే ఎరిక్‌ను పోలీసులు అనుమానించి ఇంట్లో వేలిముద్రలు, కొన్ని వివరాలు సేకరించారు. ఎరిక్ వేలిముద్రలు, డీఎన్ఏతో మ్యాచ్ చేసి చూసిన వారు అదుపులోకి విచారణ జరిపారు. తాను రిమోట్ చోరీచేసినట్లు అంగీకరించాడు. పలుమార్లు చోరీలకు పాల్పడిన ఎరిక్‌కు చికాగో కోర్టు 22 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సగం శిక్షాకాలాన్ని పూర్తయిత తర్వాతే అతడికి పెరోల్ అవకాశం కల్పించింది. -
విజన్ టెక్కు నోటీసులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: టెలివిజన్ (టీవీ) రిమోట్‌తో కరెంటు మీటర్ల రీడింగ్ నిలిచిపోవడంపై తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) స్పందించింది. టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆగిపోయినట్లు వెల్లడైన విజన్‌టెక్ కంపెనీకి టీఎస్ ఎన్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. కంపెనీ నుంచి కొత్త మీటర్ల సరఫరాను ఆపేసింది. ఇప్పటి వరకు విజన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన మీటర్ల బిల్లులను నిలిపివేసింది. వినియోగదారుల ఇళ్లలో అమర్చిన విజన్‌టెక్ కరెంటు మీటర్లన్నింటినీ మార్చాలని ఎన్పీడీసీఎల్ నిర్ణయించింది. ఈ బాధ్యతను విజన్‌టెక్ కంపెనీకే అప్పగించింది. దీనికయ్యే మొత్తం ఖర్చును విజన్‌టెక్ కంపెనీయే భరించాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. ‘రిమోట్‌తో ఆగుతున్న రీడింగ్’ శీర్షికతో ఈ నెల 19న ‘సాక్షి’ మెయిన్ పేజీలో వచ్చిన కథనంపై స్పందించిన ఎన్పీడీసీఎల్ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఎన్పీడీసీఎల్ కొత్త మీటర్లను కొనుగోలు కోసం ఇటీవల నిర్వహించిన ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లలో పలు కంపెనీలను ఎంపిక చేసింది. 2.90 లక్షల విజన్‌టెక్ కరెంటు మీటర్ల కావాలని కంపెనీకి ఆర్డరు ఇచ్చింది. నైనా పవర్ 1.90 లక్షలు, డెసిబల్ 55 వేలు, జీనస్ 75 వేలు కరెంటు మీటర్లను సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. -
బాధ్యులు ఎవరు
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఇప్పటికే నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్)ను కొత్త మీటర్ల కొనుగోలు వ్యవహారం మరింత దెబ్బతీస్తోంది. గృహ వినియోగదారుల కోసం కొనుగోలు చేసిన ఈ రకం మీటర్లలోని లోపాలతో బిల్లు వసూలులో భారీగా తేడా వచ్చే పరిస్థితి నెలకొంది. టెలివిజన్(టీవీ) రిమోట్‌తో కరెంట్ రీడింగ్‌ను నిలిపివేసేలా తయారైన విజన్‌టెక్ మీటర్ల వ్యవహారం ఎన్పీడీసీఎల్లో సంచలనంగా మారింది. నిబంధనల ప్రకారమే ఈ మీటర్లను కొనుగోలు చేశారా... అవసరమైన పరీక్షలు, తనిఖీలు పూర్తి చేశారా.. అనే కోణంలో విచారణ జరపాలనే డిమాండ్ సంస్థలోని ఉద్యోగుల నుంచి వస్తోంది. లోపాలు కలిగిన మీటర్లు లక్షల సంఖ్యలో వినియోగదారులకు సరఫరా జరిగేవరకు ఉదాసీనంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు భారీగా ఆర్థిక నష్టం తెచ్చే మీటర్ల కొనుగోలు బాధ్యులు ఎవరు... వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఎన్పీడీసీఎల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్పీడీసీఎల్.. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిర్వహిస్తున్నది. ఇళ్లకు కొత్త కనెక్షన్లతోపాటు మీటర్ల కాలిపోయినప్పుడు, సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడు కొత్త మీటర్లు అమర్చుతారు. ఎన్పీడీసీఎల్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానంలో టెండర్లు పిలిచి, కంపెనీలతో ఒప్పందం చేసుకుని మీటర్లను సేకరిస్తుంది. ఇటీవ నిర్వహించిన టెండర్లలో... విజన్‌టెక్, నైనా పవర్, డెసిబల్, జీనస్ కంపెనీలను మీటర్ల సరఫరా కోసం ఎన్పీడీసీఎల్ ఎంపిక చేసింది. విజన్‌టెక్ 1.40 లక్షలు, నైనా పవర్ 1.90 లక్షలు, డెసిబల్ 55 వేలు, జీనస్ 75 వేలు కరెంటు మీటర్లను సరఫరా చేశాయి. ఒక్కో మీటరుకు రూ.747 రూపాయల చొప్పున కొనుగోలు చేసిన విజన్‌టెక్ కంపెనీ మీటర్లు ఇప్పుడు ఎన్పీడీసీఎల్కు తలనొప్పిగా మారాయి. రూ.10.45 కోట్లతో కొనుగోలు చేసిన ఈ మీటర్లు... టీవీ రిమోట్‌తో రీడింగ్ ఆగిపోతున్నాయి. ఈ విషయం ఇప్పటికే అధికారులకు, పలువురు వినియోగదారులకు తెలిసింది. దీంతో బిల్లు రూపంలో వచ్చే మొత్తంలో తేడా ఉంటోంది. ఇకముందు ఈ తేడా ఇంకా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ మీటర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చే ముందు బెంగళూరులోని సెంట్రల్ పవర్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సీపీఆర్ఐ)కు, చెన్నైలోని ఎలక్ట్రానిక్ టెస్ట్ డెవలప్‌సెంటర్(ఈటీడీసీ)కి పంపిస్తారు. అక్కడి పరీక్షల్లో ఆమోదం పొందిన కంపెనీలనే కొనుగోలు చేస్తారు. ఎన్పీడీసీఎల్ కొనుగోలు చేసిన విజన్‌టెక్ మీటర్లను పరీక్షలకు పంపించారా లేదా అనేది సందేహంగా మారింది. ప్రఖ్యాత సంస్థల్లో పరీక్షలు నిర్వహించి ఆమోదం పొందితే రిమోట్‌తో రీడింగ్ ఎలా ఆగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజన్‌టెక్ మీటర్ల కొనుగోలు వ్యవహారంపై ఉన్నతాధికారుల నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
టీవీ రిమోట్పై ఆధిపత్యం ఎవరిది?
టీవీ రిమోట్పై ఆధిపత్యం ఎవరిది? దీనికి సమాధానం దశాబ్దాలుగా తేలనేలేదు.. నాకా సీరియల్ కావాలి.. నేనీ మ్యాచ్ చూడాలి అంటూ కుటుంబాల్లో పోరాటం కొనసాగుతునే ఉంది.. సందట్లో సడేమియాలా ఇప్పుడో కొత్త పోటీదారు వచ్చింది.. భార్యా, భర్త, పిల్లల పోరాటం మధ్య కుక్క కూడా వచ్చి చేరింది.. నేనా డిస్కవరీ చానల్ చూడాలి అంటూ గయ్యిమంటోంది.. పైగా.. దీని కోసం ప్రత్యేకంగా ఇప్పుడు కొత్త రిమోట్ కూడా వచ్చేసింది.. అంటే.. మనతో సంబంధం లేకుండా దానికిష్టం వచ్చినట్లు చానల్స్ మార్చేస్తుందన్నమాట. బ్రిటన్‌కు చెందిన ప్రొఫెసర్ డగ్లస్, వాగ్ అనే పెట్ కంపెనీ కలిసి దీన్ని తయారుచేశాయి. కాళ్లతో నొక్కేటట్లుగా రూపొందించారు. వైర్లు వంటివాటిని కుక్కలు నమిలేయకుండా ఉండటానికి ఇందులో మందంగా ప్లాస్టిక్ కోటింగ్ వేశారు. ఇంట్లో కుక్కలను ఒంటరిగా వదిలివెళ్లినప్పుడు వాటికి ఉద్దేశించిన చానళ్లను అవి చూడటానికి ఈ రిమోట్ ఉపయోగపడుతుందని డగ్లస్ చెబుతున్నారు. ఇప్పటికే కుక్కలకు దీన్ని ఇచ్చి.. వాడేలా చూశారు.. సానుకూల ఫలితాలు వ చ్చాయట. ఇటీవల బ్రిటన్‌లో జరిపిన ఓ సర్వేలో కుక్కలు తమతోపాటు సోఫాలో కూర్చుని టీవీ చూస్తాయని 91 శాతం మంది చెప్పారు. ప్రతి కుక్క రోజులో సగటున ఒక గంట 20 నిమిషాల సమయాన్ని టీవీ చూడటానికి వెచ్చిస్తుందట. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ రిమోట్ ధర రూ.4500. -
మీ ఆవిడకు కోపం రాకుండా ఉండాలంటే...
* కొందరు పురుషులు భార్యను సంబోధించే విషయంలో మర్యాదకు చాలా యోజనాల దూరంలో ఉంటారు. ‘ఒసేయ్’ ‘ఏమే’లాంటి పదాలతో పిలుస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ముద్దు పేరుతో పిలవండి. * టీవి రిమోట్ మీద పురుషులకు మాత్రమే పూర్తి హక్కులు లేవు. ఆమె టీవిలో ఏదైనా కార్యక్రమం చూస్తుంటే ‘‘సోది పోగ్రాం...ఏం చూస్తావ్’’ అని రిమోట్ లాక్కొని మీకు నచ్చిన కార్యక్రమం పెట్టడం అన్యాయం. సంసార విరుద్ధం. * ‘‘కూరగాయలు తెచ్చిస్తారా’’ అని భార్య అడగగానే ‘‘చాలా పని ఉంది. నువ్వెళ్లి తెచ్చుకో’’ అని తప్పించుకుంటాడు భర్త. దీన్ని మార్చుకోవాలి. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చివ్వడం వల్ల మీరు వాకింగ్ చేసినట్లు ఉంటుంది, భార్యకు సహకరించినట్లూ ఉంటుంది. * భార్య ఏది చెప్పినా ‘నీకెమీ తెలియదు. నోర్మోసుకో’ అని కసురుకొనే భర్తలు ఉన్నారు. ఇలాంటి మాటల వలన మన అహంకారం, అజ్ఞానం బయటపడుతుంది తప్ప...కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. భార్య మాటకు విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. * ‘ఆలస్యంగా ఇంటికి చేరడం నా జన్మహక్కు’ అన్నట్గుగా ప్రవరిస్తుంటారు కొద్దిమంది పురుషులు. ఇలా తరచుగా చేయడం వల్ల కుటుంబానికి, తనకు మధ్య మానసిక దూరం పెరుగుతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.