సాక్షి, హైదరాబాద్: పెరిగిన ఇంధనం ధరలతో అల్లాడిపోతున్న వాహనదారులను కొందరు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా దోచుకుంటున్నారు. మీటర్లలో ప్రత్యేకమైన చిప్‌లు పెట్టి జనాలను మోసం చేస్తున్నారు. ఈ చిప్‌లతో రీడింగ్ సరిగానే చూపెట్టినా పెట్రోల్ మాత్రం తక్కువగా వస్తుంది. పక్కా సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు కొన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయగా ఈ వ్యవహారం బయటపడింది. మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ పరిధిలో 13 పెట్రోల్ బంక్‌లను ఎస్‌వోటీ పోలీసులు సీజ్ చేశారు. 26 మందిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎస్‌వోటీ పోలీసుల సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా 26 పెట్రోల్ బంకులను అధికారులు సీజ్ చేశారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుని నిందితులు ఈ చిప్‌లను వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి దోపిడీ జరుగుతోందని, అందరిపైనా చర్యలు తీసుకుంటామని ఎస్‌వోటీ పోలీసులు వెల్లడించారు. చిప్‌లను ఉపయోగించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ట్లు తెలిపారు.
(చదవండి: గప్‘చిప్’గా దోపిడీ)
Comments
Please login to add a commentAdd a comment