
వీడెవడోగానీ.. దొంగతనాల్లో మరీ ఎల్ బోర్డు టైపులాగున్నాడు.. లేకపోతే.. చేయకచేయక దొంగతనానికి బయల్దేరినప్పుడు.. ఎవడైనా.. పోలీసు ఆఫీసరు ఇంటికి పోతాడా.. పోనీ తెలియక వెళ్లామే అనుకోండి.. వెళ్లామా.. వెంటనే పని ముగించుకుని వచ్చామా అన్నట్లు ఉండాలి. అంతేతప్ప.. అలసటగా ఉందని చెప్పి.. అక్కడో ఖాళీ రూం.. అందులో ఏసీ కనిపిస్తే.. చిన్న కునుకేద్దామని ఎవరైనా అనుకుంటారా? థాయ్‌లాండ్‌కు చెందిన అత్చిత్(22) మాత్రం ఇలాగే అనుకున్నాడు.
చిన్నగా కునుకేద్దామని వెళ్లినోడు కాస్త.. పెద్దగా గురకపెట్టే దాకా పోయాడు. పొద్దునే ఆ పోలీసు లేచి చూసేదాక.. మనోడు లెగిస్తేగా.. పోలీసులంతా కలసి లేపితే గానీ చివరకు లేవలేదు. దొంగతనం చేయడం తప్పాఅండీ.. అదొక ఆర్టండీ.. అని బుకాయించడానికి చూసినా.. వదిలేయండి బాబూ మా ఇంటికెళ్లిపోతాను అని కాళ్లమీద పడి ప్రాధేయపడినా.. పోలీసులంతా కలిసి అత్చిత్‌ను నేరుగా అత్తారింటికే తీసుకెళ్లిపోయారట.
Comments
Please login to add a commentAdd a comment