
చెన్నై : విల్లుపురం జిల్లా పూవరసం కుప్పంలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. వివరాలు.. విక్రవాండి సమీపంలోని పనయకపురానికి చెందని సహాయం కుమారుడు లియోబాల్(31)కు సుజిత మేరి (25) అనే యువతితో 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యతో కలిసి లియోబాల్ పూవరసం కుప్పంలో నివసిస్తున్నాడు. అక్కడ రాధాకృష్ణన్(22) అనే యువకుడితో లియోబాల్‌కు పరిచయమైంది. కొద్దికాలంలోనే ఇద్దరూ స్నేహితులయ్యారు. ఫిబ్రవరి 4వ తేదీన బంధువుల పెళ్లికని వెళ్లిన లియోబాల్ తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై లియోబాల్ తండ్రి సహాయం ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 21వ తేదీన సుజితమేరీ, రాధాకృష్ణన్ అదృశ్యమయ్యారు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా సుజితమేరీ, రాధాకృష్ణన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం భర్త లియోబాల్ గుర్తించడంతో అతడిని హత్య చేసి ఇంటి పెరట్లోనే పాతిపెట్టినట్లు వెల్లడైంది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment