ప్రతీకాత్మక చిత్రం
మధ్యప్రదేశ్: సాక్షాత్తు కట్టుకున్న భర్త తన భార్యను ఇంట్లో ప్రియుడితో కలిసి చూడరాని పరస్థితుల్లో చూశాడు. ఇక ఆ భర్త తట్టుకోలేకపోయాడు ఆ ఇద్దర్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి మరీ చితకబాదాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ ప్రాంతంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. భర్త కళ్లుగప్పి ఓ మహిళ చేయకూడని తప్పు చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఇంట్లోనే వివాహేతర సంబందాన్ని గత కొన్నాళ్లుగా కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఆ వివాహిత నిజస్వరూపం బయటపడింది. కాగా ఓ రోజు ఇంట్లోనే తన భార్యను మరో వ్యక్తితో చూడటంతో తట్టుకోలేకపోయాడు. భార్య చేసిన తప్పుడు పనిని గ్రామస్తులందరికి తెలియజేయాలకున్నాడు ఆ భర్త. దాంతో ఊరి మధ్యలో ఉన్న ఓ చెట్టుకు కట్టేసి భార్యతో పాటు తన ప్రియుడికి కూడా దేహశుద్ధి చేశాడు.
వివాహితతో పాటు ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేయడాన్ని సదరు భర్త బంధువులు కూడా అతనికి అండగా నిలిచారు. ఇలా రెండు గంటల పాటు ఇద్దరినీ చితకబాదుతుండగా వాళ్ల అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికులు దీనికి సంబందించిన దృశ్యాలను షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. ఓ వైపు భర్తతో కాపురం చేస్తూనే మరోవైపు ప్రియుడితో కలిసి తన ఇంట్లోనే వివాహేతర సంబందం నడుపుతున్న విషయం బయటపడటంతో గ్రామస్తులు కూడా వివాహితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భర్త దేహశుద్ధి చేస్తుండగా అందరూ అతనికే మద్దతుగా నిలిచి మహిళను తిట్టిపోశారు.
ఇదిలా ఉండగా ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని చెట్టుకు కట్టేసిన కట్లను విప్పి వివాహితతో పాటు తన ప్రియుడిని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు భార్య తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ భర్తే వారిని శిక్షించడాన్ని పోలీసులు తప్పు పట్టారు. వారిపై దాడి చేసిన భర్త పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం భార్య, భర్తలను ఇద్దర్ని కలిపేందుకు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment