
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కంటోన్మెంట్: పరిచయస్తురాలైన వివాహిత అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడంతో మనస్తాపం చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. బల్కంపేటకు చెందిన దుర్గేశ్ (31) రెండేళ్ల క్రితం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మైత్రివనం రాంరెడ్డి కాలనీలోని ఓ ఇంట్లో ఎలక్ట్రిషియన్‌గా పనిచేశాడు. ఆ సమయంలో పక్కింట్లో ఉండే వివాహితురాలితో దుర్గేశ్‌కు పరిచయం ఏర్పడిండి.
పరిచయస్తురాలిగా మారిన ఆమె ఇంట్లోనూ ఎలక్ట్రికల్ పనులు చేశాడు. వీరి పరిచయం బాగా పెరగడంతో దుర్గేశ్ తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. ఇటీవల ఆమె దుర్గేశ్‌తో మాట్లాడటం మానేసింది. దీంతో మనస్తాపం చెందిన దుర్గేశ్ గురువారం ఆ మహిళ ఇంటికెళ్లి, బెడ్‌రూమ్‌లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక ఆత్మహత్య
చిలకలగూడ: బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ మైలార్‌గడ్డకు చెందిన బ్రెస్సిల్లా (16) గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్‌ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంత సమయం తర్వాత కుటుంబసభ్యులు వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు.
.