
సాక్షి, అనంతపురం : ప్రియురాలి సానుభూతి కోసం తనలోని నటుడ్ని బయటపెట్టాడో ప్రియుడు. ఆస్కార్ లెవల్లో నటించి.. దాన్ని సెల్ఫీ వీడియోలో చిత్రీకరించి కలకలం రేపాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కళ్యాణ దుర్గం మండలం తిమ్మాపురానికి చెందిన శశిధర్.. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ వివాహానికి అమ్మాయి తరపు వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రియురాలి సానుభూతి పొందటానికి ఓ పెద్ద ప్లాన్ వేశాడు. గాజు పెంకులతో పొడుచుకుని సెల్ఫీ వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ( ఈవెంట్‌లా కిడ్నాప్.. ఎవరెవరి పాత్రలు ఏంటంటే )
కులాంతర వివాహానికి అడ్డుపడుతున్న వారే తనపై దాడి చేశారని శశిధర్ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చారు. ప్రేమ కోసం శశిధర్ హత్యాయత్నం డ్రామా ఆడాడని వెల్లడించారు. ప్రియురాలు, బంధువులను తప్పు దారి పట్టించేందుకు శశిధర్ నాటకాలు ఆడినట్లు నిర్ధారించారు.
Comments
Please login to add a commentAdd a comment