
సాక్షి, ఖమ్మం: వైరా మున్సి పాలిటీ 3వ వార్డుకు చెందిన యువతి బుధవారం బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... తుళ్లూరి సాయిప్రసన్న(22) ఇంట్లో ఎవరూ లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి చంద్రకళ ఓ కిరాణా దుకాణంలో, తమ్ముడు విజయవాడలో గుమాస్తాగా, చెల్లి మిషన్ కుట్టి జీవనం సాగిస్తున్నారు.
ఇక అయ్యప్ప ఆలయంలో పనిచేసే సాయిప్రసన్నకు ఇటీవల ఖమ్మంకు చెందిన యువకుడితో నిశ్చితార్థమైంది. మధ్యాహ్నం వరకు గుడిలో పనిచేసిన ఆమె తల్లి ఉండే షాపు వద్దకు వెళ్లాక ఇంటి కొచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరప్రసాద్ తెలిపారు.