
●
● జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు కృషిచేద్దాం
● వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్
మిథున్‌రెడ్డి
అమలాపురం రూరల్: వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొని, జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దామని వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిఽథున్‌రెడ్డి అన్నారు. అమలాపురంలోని గ్రాండ్ పార్కులో ఆదివారం రాత్రి జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, రాపాక వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌లు పాల్గొని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.
అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు
మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయాత్తం చేసేందుకు త్వరలోనే అన్ని నియోజకవర్గాలో పార్టీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల హామీలను 90 శాతానికి పైగా అమలు చేశామన్న ధైర్యంతోనే ప్రజల ముందుకు గడపగడపకూ వెళుతున్నామన్నారు. మిగిలిన పార్టీలకు అలా చెప్పుకునే ధైర్యం లేక, అడ్డదారుల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గెలిచే బలం లేకనే జనసేన తదితర పార్టీలతో పొత్తుల కోసం టీడీపీ నాయకులు ఎగబడుతున్నారని విమర్శించారు.
అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తివేస్తాం
అమలాపురం టౌన్: కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టినప్పుడు జరిగిన అమలాపురం అల్లర్లకు సంబంధించిన కేసులను ఎత్తివేస్తామని, వీటి విషయంలో ఎవ్వరూ అధైర్యపడవద్దని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. అమలాపురంలోని గ్రాండ్ పార్కులో ఆదివారం సాయంత్రం విలేకర్ల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. పలు ప్రశ్నలకు మిధున్‌రెడ్డి, మంత్రులు సమాధానాలు చెప్పారు.
భూసేకరణ మాదే
కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ వ్యయంతో 25 నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్న ఒప్పందం గతంలోనిదని మిథున్‌రెడ్డి సమక్షంలో మంత్రి విశ్వరూప్ వివరణ ఇచ్చారు. ఆ ఒప్పందంలో మార్పులు జరిగాయని చె ప్పారు. ఇప్పుడు ప్రాజెక్ట్ వ్యయంలో 25 శాతం నిధులు భరించకుండా దానిస్థానే రైల్వే ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చు అంతా రాష్ట్ర ప్రభు త్వమే భరించేలా కొత్త ఒప్పందం కుదిరిందన్నారు.
కోనసీమ ముందంజ
జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ విధానాలను తెలియజెప్పడంతో ముందున్నారన్నారు. మీకు మేలు జరిగిందని అనిపిస్తేనే మాకు ఓటు వేయండి అని ప్రజలను అడుగుతున్న ముఖ్యమంత్రి దేశంలోనే జగన్ ఒక్కరేనన్నారు. అన్ని హామీలూ నెరవేర్చామన్న నమ్మకంతో ఓటర్లు తమవైపే విశ్వాసంగా ఉన్నారని తెలిపారు. కోనసీమ జిల్లాలో పాత ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇస్తాం, మళ్లీ కోనసీమలో వైఎస్సార్ సీపీదే హవా అని స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర దృశ్యకళల అకాడమీ చైర్‌పర్సన్ కుడుపూడి సత్య శైలజ, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, రాష్ట్ర అగ్రిమిషన్ సభ్యుడు జిన్నూరి బాబీ, సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, అమలాపురం పట్టణ, మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, బొంతు గోవిందశెట్టి, కొనుకు బాపూజీ, జెడ్పీటీసీ సభ్యులు పందరి శ్రీహరి రామగోపాల్, గెడ్డం సంపదరావు, గన్నవరపు శ్రీనివాసరావు,ఎంపీపీ ఇళ్ల శేషారావు జిల్లా డీసీఎంఎస్ చైర్‌పర్సన్ సాకా మణికుమారి, మంత్రి విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, సెంట్రల్ డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు, జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ ఖాదర్, పార్టీ పరిశీలకులు ఎ.రాజబాబు, రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment