
అతివేగంతో అదుపు తప్పి..
మండపేట: స్థానిక బైపాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. రావులపాలెం నుంచి కాకినాడ వెళ్తున్న సుజుకీ ఎర్టిగా కారు వేగంగా వస్తూ ఏడిద బైపాస్ జంక్షన్ వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని, ఆ వెంటనే టూ వీలర్‌ను ఢీకొంది. దీంతో కపిలేశ్వరపురం మండలం నల్లూరు గ్రామానికి చెందిన పొడగట్లపల్లి రాంబాబు తన కుమారుడు హేమంత్ గాయపడ్డారు. అలాగే కారు మీదకు దూసుకు వస్తుండడంతో అక్కడే టీ దుకాణం వద్ద కుర్చీలో కూర్చుని టీ తాగుతున్న కురుపూడి శ్రీనివాస్ ఎగిరి పడగా, దుకాణం నిర్వాహకురాలైన మజ్జి లక్ష్మి కాలు, తలకు గాయాలయ్యాయి. వీరిని 108 లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన హేమంత్, కారు డ్రైవర్‌ను అంబులెన్స్‌లో రాజమండ్రికి తరలించారు. హేమంత్ పరిస్థితి విషమంగా వున్నట్టు తెలిసింది. పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనంతరం ఆసుపత్రిలో వారి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభాన్ని, వెంటనే
టూ వీలర్‌ను ఢీకొట్టిన కారు
ఐదుగురికి గాయాలు
రాజమహేంద్రవరానికి ఇద్దరి తరలింపు
బాలుడి పరిస్థితి విషమం!

అతివేగంతో అదుపు తప్పి..