పరుగులు తీసిన ప్రయాణికులు
సామర్లకోట: ఎటువంటి అనౌన్స్‌మెంట్, ప్లాట్‌ఫాంపై డిస్‌ప్లే లేకుండా సామర్లకోట రైల్వే స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఏపీ ఎక్స్‌ప్రెస్ వచ్చిందని రైలు ప్రయాణికులు ఆరోపించారు. రైలు వచ్చే ముందు బోగీల సమాచారం తెలిసేలా డిస్‌ప్లేతో పాటు, అనౌన్స్‌మెంట్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది.
విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ వచ్చే ముందు ఇవేమీ చేయలేదని, దీంతో రైలు వచ్చిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, పిల్లలతో, మహిళలతో పరుగులు తీయాల్సి వచ్చిందని బీజేపీ అనుబంధ యువమోర్చా రాష్ట్ర సభ్యుడు ఎస్ అనిల్‌కుమార్ మంగళవారం ఆరోపించారు. తాము న్యూఢిల్లీ వెళ్లడానికి సోమవారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్‌లో వేచిఉన్నామని తెలిపారు.
సమాచారం లేకుండా రైలు వచ్చిందని, డిస్‌ప్లే లేకపోవడం వల్ల ఏ బోగీ ఎక్కడ వచ్చిందో తెలియక మహిళలు, పిల్లలతో పరుగులు తీశామని చెప్పారు. దీనిపై న్యూఢిల్లీ వెళ్లాక సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్‌ను వివరణ కోరుతామని అనిల్‌కుమార్ స్థానిక విలేకర్లకు ఫోన్‌లో తెలిపారు. ఈ సంఘటనపై రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్‌ను వివరణ కోరగా, రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బందిపై విచారణ చేస్తామని చెప్పారు. ప్రతి రైలుకు తప్పనిసరిగా అనౌన్స్‌మెంట్‌తో పాటు, బోగీల డిస్‌ప్లే వేయాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment