కొబ్బరి ఆకు వివాదం.. సోదరుల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

కొబ్బరి ఆకు వివాదం.. సోదరుల మధ్య ఘర్షణ

Published Fri, Nov 1 2024 10:06 AM | Last Updated on Fri, Nov 1 2024 10:47 AM

-

 సోదరుల మధ్య ఘర్షణ

ఎర్రగరువు గ్రామంలో ఘటన

ఐ.పోలవరం: ఓ కొబ్బరి ఆకు కారణంగా సొంత అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి, కత్తిపోట్లకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ఐ.పోలవరం మండలం ఎర్రగరువు గ్రామంలో గంజా రాధాకృష్ణ, పక్కనే అతడి అన్న సత్యనారాయణ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సత్యనారాయణ ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టు ఆకు మంగవారం విద్యుత్‌ తీగలపై పడింది. దీని వల్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

ఈ విషయంపై రాధాకృష్ణ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మీ కొబ్బరి ఆకు వల్లే విద్యుత్‌ ఆగిపోయిందని రాధాకృష్ణ, కొబ్బరి ఆకు పడితే మా తప్పు ఏమిటని సత్యనారాయణ ఘర్షణ పడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన రాధాకృష్ణ తన అన్న సత్యనారాయణ, వదిన వెంకటలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయపడిన వారిద్దరిని స్థానికులు యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement