
దుర్గమ్మకు రూ.10 లక్షలతో వెండి చీర సమర్పణ
మండపేట: పట్టణంలోని సైథిల్‌పేటలో సత్తివారి ఇంట వెలసిన కనకదుర్గమ్మ తల్లికి రూ.10 లక్షలతో వెండి చీరను చేయించారు. ఆలయ 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సత్తి వెంకన్న దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారికి వెండి చీరను అలంకరించారు. అమ్మవారు దేదీప్యమానంగా ఆకర్షణీయంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మందిరం వద్ద కుంకుమార్చన, అనంతరం భారీ అన్నసమారాధన నిర్వహించారు. నిర్వాహకులు సత్తి వెంకటేష్ మాట్లాడుతూ అమ్మ భక్తులు, దాతల సహకారంతో రూ.11 లక్షలు సమకూరగా అ కానుకలతో వెండి చీరను చేయించినట్టు తెలిపారు. అమ్మవారికి వెండిచీరను అలంకరించి మహిళలచే ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఐదు వేల మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment