
ఏపీఎస్పీ కమాండెంట్‌గా
నాగేంద్రరావు
కాకినాడ రూరల్: ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా ఎం.నాగేంద్రరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆక్టోపస్ కమాండెంట్‌గా ఉన్న ఆయనను ప్రభుత్వం ఇటీవల కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా నియమించింది. బెటాలియన్‌కు వచ్చిన ఆయనకు తొలుత అదనపు కమాండెంట్ దేవానందరావు మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం హెచ్‌ఏసీ కమాండెంట్ రామకృష్ణ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ, గతంలో మూడో బెటాలియన్ అదనపు కమాండెంట్‌గా పని చేశానని, ఇప్పుడు ఇదే బెటాలియన్‌కు కమాండెంట్‌గా రావడం ఆనందంగా ఉందని అన్నారు. సిబ్బంది పనితీరు మెరుగు పరచడంతో పాటు వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, శ్రీనివాస్, బాబ్జీ, ఆర్‌ఐలు విఠలేశ్వరరావు, రవిశంకర్, అజయ్‌కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొని, నాగేంద్రరావుకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment