
కుంభమేళాకు ప్రత్యేక రైలు
కాకినాడ: మహాకుంభమేళాకు వెళ్లే కాకినాడ జిల్లా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ–ప్రయాగరాజ్ మధ్య ఈ ప్రత్యేక రైలు ప్రయాణిస్తోంది. ఎంపీ విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వేశాఖ ఈ రైలును ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి సామర్లకోట వరకు ఎంపీ తంగెళ్ల స్లీపర్ రైలు బోగీలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించి కుంభమేళా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కౌడా చైర్మన్ తుమ్మల బాబు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ లాజర్ బాబు, నాయకులు నున్న దొరబాబు, మాదేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో
వృద్ధుడి ఆత్మహత్య
కొత్తపేట: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒక వృద్ధుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ హెచ్‌సీ రమేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని వానపల్లి శివారు సంగంపాలెం గ్రామానికి చెందిన ఇళ్ల పళ్లంశెట్టి (79) సుమారు నాలుగేళ్ల క్రితం గుండెపోటుకు గురై స్టంట్ వేయించుకున్నాడు. అప్పటి నుండి ఆరోగ్యం సరిగా లేక, రెండు కాళ్లు విపరీతమైన బాధపడుతున్నాడు. ఆ బాధ తాళలేక ఈ నెల 7న సాయంత్రం గడ్డి మందు తాగాడు. ఇది గమనించిన అతని బంధువులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రాధమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. పళ్లంశెట్టి కుమారుడు ఇళ్ల కోప్పేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు హెచ్‌సీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment