
పైడికొండలో ఆటో బోల్తా
తొండంగి: ముగ్గురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోలో డ్రైవర్‌తో కలిపి 19 మంది ప్రయాణించడంతో ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. తొండంగి మండలం పైడికొండలో శనివారం జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణాపురంలో అవంతి రొయ్యల కంపెనీలో పని చేసేందుకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రామభద్రాపురం నుంచి ఆటో వెళ్తుంది. శనివారం ఉదయం రామభద్రాపురం, శ్రీరాంపురం గ్రామాలకు చెందిన కూలీలను ఎక్కించుకుని ఆనూరు, పైడికొండ మీదుగా వెళ్తుండగా అక్కడి మలుపు వద్ద చెట్లు కొట్టేసి రహదారిపై వదిలేసిన ప్రదేశం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ పట్నాల సంతోష్‌తో పాటు 16 మంది మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అంత మంది ఒకేసారి గాయాలపాలవడంతో ఆ ప్రాంతం రోదనలతో మిన్నంటింది. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనాలు సరిపోకపోవడంతో కొద్ది మంది ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఆర్తనాదాలు చేశారు. వెంటనే స్థానికులు వైద్యం నిమిత్తం వారందరినీ తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై జగన్మోహన్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడినవారి వివరాలివీ....
ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెదరామభద్రాపురానికి చెందిన నక్కిన లక్ష్మి, ఎస్.లక్ష్మి, కనకం దేవి, మంతిన రమణమ్మ, పులి లోవకుమారి, గెడ్డమూరి సీతారత్నం, కోటిన లక్ష్మి, పగడం చిన్నమ్ములు, జీలం పద్మ, తుంపాల అనంతలక్ష్మి, ఉగ్గిన దేవి, ఉగ్గిన సత్యవతి, నంగిన పద్మ, శ్రీలం ధనలక్ష్మి, కర్రి లక్ష్మి, నారిపిరెడ్డి నాగమణి, పట్నాల సంతోష్ (ఆటో డ్రైవర్)లకు తలకు, కుడిభుజం, కాళ్లు, చేతులు, నడుమ విరగం వంటి తీవ్రగాయాలయ్యాయి. వీరికి తుని ఏరియా ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం కొంత మందిని కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అధిక లోడుతో పాటు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.
డ్రైవర్ సహా 16 మంది
మహిళలకు తీవ్రగాయాలు
క్షతగాత్రులంతా
రొయ్యల కంపెనీ కార్మికులు

పైడికొండలో ఆటో బోల్తా

పైడికొండలో ఆటో బోల్తా
Comments
Please login to add a commentAdd a comment