
అంగరంగ వైభవంగా ఆదిత్యునికి..
పెదపూడి: గోవింద నామస్మరణ నడుమ ఉష, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యనారాయణుని కల్యాణం శనివారం వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలు, భక్తుల సందడితో స్వామి వారి కల్యాణం నయన మనోహరంగా సాగింది. అలాగే మధ్యాహ్నం 1.05 గంటలకు స్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే ఏకై క వైష్ణవ సాంప్రదాయంలో పూజాదికాలు అందుకునే ఆలయంగా మండలంలోని జి.మామిడాడ గ్రామంలోని సూర్యదేవాలయం ప్రసిద్ధిగాంచింది. భీష్మ ఏకాదశి శనివారం రాత్రి స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి దేవదాయ శాఖ తరుఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో 15 మంది పండితులు స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు సుముహూర్తం, స్వామివారి కల్యాణం వైభవంగా సాగాయి. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జాము 3.30 నిముషాల నుంచే స్వామివారిని మెల్కొలిపి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం 11.30 గంటలకు ఆలయంలోని ఉత్సవ మూర్తులను పల్లకిలో రథంలో ఆసీనులను చేశారు. పూజల అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు రథోత్సవాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వామి వారిని దర్శించుకుని రథోత్సవంలో పాల్గొన్నారు. స్థానిక ఎస్సై కె.రామారావు అధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
జి.మామిడాడలో కన్నుల పండుగగా జరగుతున్న రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment