పులకించిన ధవళగిరి
●
● వైభవంగా లక్ష్మీజనార్దన స్వామి కల్యాణోత్సవం
● కన్నుల పండువగా రథోత్సవం
● మార్మోగిన గోవింద నామస్మరణ
ధవళేశ్వరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధవళేశ్వరం గ్రామంలోని ధవళగిరి గోవింద నామస్మరణతో మార్మోగింది. నవజనార్దనుల్లో ప్రథముడైన ధవళగిరి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ జనార్దనస్వామి వారి రథోత్సవం, కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగిన వేళ.. చూసిన కన్నులదే వైభోగం అన్నట్లు పులకించింది. శనివారం తెల్లవారుజామున విశేష అర్చనలతో శ్రీలక్ష్మీ జనార్దనస్వామి వారి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం రథ సంప్రోక్ష ణ, మధ్యాహ్నం 3.30 గంటలకు రథోత్సవం, అనంతరం ధ్వజారోహణ, అంకురార్పణ, వాస్తు పూజ, రాత్రి స్వామివారి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు స్థానిక రామపాద క్షేత్రం వద్ద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, జనార్దన స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు రథోత్సవంలో పా ల్గొని, స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా దేవదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యాన సీఐలు టి.గణేష్, కె. మంగాదేవి భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈవో కె.నాగ సురేష్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పులకించిన ధవళగిరి
Comments
Please login to add a commentAdd a comment