13 మద్యం షాపులకు 387 దరఖాస్తులు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో ఏపీ ప్రభుత్వం కల్లు గీత కులాల వారికి కేటాయించిన 13 మద్యం షాపులకు 387 దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చాయని గత నెల 27న ప్రభుత్వం మద్యం షాపులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, శనివారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ, ఆయా ఎకై ్సజ్ స్టేషన్లలో డీడీలతో గడువుకు ముందు వచ్చిన వారిని అనుమతించారు. ఈనెల 6వ తేదీతో గడువు ముగిసినప్పటికీ 13 మద్యం షాపులకు కేవలం 37 దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం రెండురోజులు గడువు పెంచింది. దీంతో శనివారం రాత్రి 7.30 గంటలకి 387 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆదివారం మద్యంషాపులు దరఖాస్తులు పరిశీలిస్తామని, ఈనెల 10వతేదీ రాజమండ్రి ఆర్‌డీవో కార్యాలయంలో మద్యం షాపులు లాటరీ ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసి షాపులను కేటాయిస్తామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారిణి చింతాడ లావణ్య తెలిపారు.
కోటసత్తెమ్మ సన్నిధిలో రిటైర్డ్ జడ్జి
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారిని హైకోర్టు రిటైర్డ్ జడ్జి బులుసు శివశంకర్ శనివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్‌లు శివశంకర్‌ను, సిద్ధాంతి పి.వీరభద్రను సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు అప్పారావు శర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ వాహనాలు, కాలి నడకన పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.5,45,693 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. 15 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
13 మద్యం షాపులకు 387 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment