‘మాక్సివిజన్’ కంటి ఆస్పత్రి ప్రారంభం
కంబాలచెరువు: స్థానిక దానవాయిపేట చిన్న ఆంజనేయస్వామి గుడి వీధిలో శనివారం మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని ఫౌండర్, చీఫ్ మెంటార్ డాక్టర్ కాసు ప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా, చిన్నపిల్లల దృష్టి లోపాల సవరణకు చికిత్సలు, అడ్వాన్స్ లేజర్ విజన్ కరెక్షన్ ఆపరేషన్స్ చేయనున్నట్టు తెలిపారు. తమ హాస్పటల్‌లో 10 వేల చదరపు అడుగులు కలిగిన మాడ్యూలర్ హెఫా ఫిల్టర్డ్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయన్నారు. పదేళ్ల అనుభవం కలిగిన వైద్య బృందంతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment