ర్యాంకుల డ్రామా!
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
బాబు గారి
మా బాబే..! మీ వైఫల్యాలకు మమ్మల్ని బలి చేస్తారా?
● ఇప్పటికే మంత్రుల పనితీరుపై
ర్యాంకుల ప్రకటన
● ఇక ఎమ్మెల్యేలు, ఎంపీ, పీఏలపై
చంద్రబాబు నజర్
● ముగిసిన ఐవీఆర్‌ఏస్ సర్వే
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిది నెలలు దాటింది. సూపర్ సిక్స్ హామీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో చంద్రబాబు సర్కారుపై ఇప్పటికే ప్రజ ల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వారి దృష్టిని మళ్లించే లక్ష్యంతో చంద్రబాబు రోజుకో గిమ్మిక్కు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రులకు ర్యాంకుల పేరుతో ఇప్పటికే ఆయన ఓ ప్రహసనం నడిపారు. దీనికి కొనసాగింపుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ర్యాంకులు ప్రకటించి, మరో డ్రామాకు తెర లేపేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వారి పనితీరుపై సీఎం చంద్రబాబు ఇంటర్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్‌ఎస్) సర్వే నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల పనితీరు ఎలా ఉంది? ఫర్వాలేదా? బాగుందా? ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? కొత్త రోడ్లు వేస్తున్నారా? వంటి అంశాలపై ఈ సర్వేలో ఆరా తీసినట్లు తెలిసింది. వారి పీఏల దందాలపై కూడా పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం.
ఇద్దరిపై అసంతృప్తి!
● ఎనిమిది నెలల పాలనలో కొంత మంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. తమకు మంత్రి లోకేష్ అండదండలున్నాయంటూ వారు, వారి అనుచరులు ఆయా నియోజకవర్గాల్లో ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. వారి విధానాలను ఆ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు.
● జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురున్నారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐవీఆర్‌ఎస్ సర్వేలో తీవ్రమైన అవినీతి అరోపణలు వచ్చినట్లు సమాచారం. మద్యం, ఇసుక వ్యవహారాల్లో తలదూర్చడంతో పాటు, ప్రతి పనిలోనూ, ఉద్యోగుల బదిలీల్లోను వసూళ్లకు పాల్పడినట్లు సర్వేలో తేలింది. దీనిపై ఇది వరకే చంద్రబాబు అక్షింతలు వేసినా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పూ రాలేదనే విషయాన్ని కూడా సర్వే బృందాలు బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు పెట్టామని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటామనే భావనతో ఆ ఎమ్మెల్యేలు అక్రమాలకు తెగబడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● ఓ ఎమ్మెల్యే అడ్డూ అదుపూ లేకుండా మద్యం, ఇసుక దందాలు సాగిస్తున్నట్లు సర్వేలో తేలింది. మద్యం వ్యాపారంలో సొంత పార్టీ నేతలకు షాపులు వచ్చినా.. వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏ పని కావాలన్నా ఆయన అనుచర నేతలకు కప్పం కట్టాల్సిందే. ఇసుక ర్యాంపులను ప్రతి నెలా ఒక కార్యకర్తకు కేటాయించి, అడ్డగోలు వ్యవహారానికి తెర తీసిన విషయం సైతం సర్వేలో వెల్లడైంది.
● మరో ఎమ్మెల్యే అనుచరులు ఇసుక మాఫియాగా మారారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక తవ్వేసి తరలించేస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు వెళ్తున్న అధికారులను సైతం లెక్క చేయని స్థాయికి మాఫియా ఎదిగిందని, వారికి ఆ ఎమ్మెల్యే అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయని సర్వే ద్వారా నిర్ధారణ అయ్యింది.
● మరో ఎమ్మెల్యే ఇసుక లారీకి ఒక ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. సదరు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు ఈ తంతును దగ్గరుండి మరీ నడిపిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేకు తృణమో పణమో సమర్పించి, మిగిలింది దోచుకుంటున్నారు. ఈ విషయం సైతం ఐవీఆర్‌ఎస్ సర్వేలో బాబు దృష్టికి చేరింది.
లోకేష్ బృందాల సర్వే?
ఇదిలా ఉండగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు కూడా సర్వేలు నిర్వహించాయని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా ఎమ్మెల్యేలు ఎంత వెనకేసుకున్నారనే విషయమై ఆయా నియోజకవర్గాల్లో రహస్య సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబుకు సైతం నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు.
అంతర్మథనం
ఇదిలా ఉండగా అధిష్టానం నిర్వహిస్తున్న సర్వేలపై కూటమి ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. ఎంతమంది, ఎన్నిసార్లు సర్వే నిర్వహిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మంత్రులతో పాటే ఎమ్మెల్యేలకు కూడా ర్యాంకులు విడుదల చేయాలని భావించారు. అయితే, అత్యధిక శాతం ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని, ఇప్పుడు ర్యాంకులు ప్రకటిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందన్న భావనతో వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అందువల్లనే ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మంత్రుల ర్యాంకులు వెల్లడించినట్లు సమాచారం. ర్యాంకింగ్ ప్రక్రియ కొందరు ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరించి కూటమిని గెలిపించామని, తాము సంపాదించుకోకపోతే ఎలాగని వారు చర్చించుకుంటున్నారు. అయితే, చంద్రబాబు ర్యాంకులు త్వరలో ప్రకటించే అవకాశం ఉందని, తమకు ఏ ర్యాంక్ వస్తుందోననే ఉత్కంఠ వరాఇలో నెలకొంది. తక్కువ ర్యాంక్ వస్తే సహచర ఎమ్మెల్యేలతో పాటు, ప్రజల్లో సైతం విశ్వాసం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. తాను బాగా పని చేస్తున్నా.. ఎమ్మెల్యేల పనితీరు బాగో లేదంటూ ప్రజల ముందు తమను తక్కువ చేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఈ ర్యాంకుల ప్రహసనం నడుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
లో
8
Comments
Please login to add a commentAdd a comment