బైకులు ఢీకొని వ్యక్తి మృతి
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అన్నవరం పోలీసుల వివరాలు ప్రకారం గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన నక్కా సత్యనారాయణ(50) కత్తిపూడిలో ఒక కార్యక్రమం నిమిత్తం బైక్‌పై వచ్చి తిరిగి చెందుర్తి వెళ్లుతుండగా వజ్రకూటం సమీపంలో ఎదురుగా జగ్గంపేట మండలం కాట్రపల్లి నుంచి కత్తిపూడి వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అన్నవరం ఎస్సై హరిబాబు తెలిపారు.
విద్యుత్ వైర్లు తెగిపడి
వ్యవసాయ కూలీ...
నిడదవోలు రూరల్: విద్యుత్ వైర్లు తెగిపడి అరటితోటలో పురుగుమందు స్ప్రే చేస్తున్న వ్యవసాయ కూలీ కరెంట్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు ఆదివారం తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మండలంలోని పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన దేశాబత్తుల నరేష్(35) పందలపర్రు శివారులోని అరటితోటలో ఆదివారం ఉదయం పురుగుమందు స్ప్రే చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగి మీద పడటంతో కరెంట్‌షాక్‌కు గురై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు చెప్పారు. కరెంట్‌షాక్‌కు గురై మృతిచెందిన దళిత యువకుడు నరేష్ కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారాన్ని విద్యుత్‌శాఖ అధికారులు ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. నరేష్ భార్య మౌనికకు ప్రభుత్వం తరుపున ఉపాధి కల్పించాలన్నారు.
మార్కెట్‌లోకి సుజుకీ
125 సీసీ స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: నగరంలోని కంటిపూడి సుజుకీ షోరూంలో సుజుకి న్యూ యాక్సెస్ 125 సీసీ స్కూటర్‌ను వినియోగదారుల చేతుల మీదుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కంటిపూడి సుజుకీ బ్రాంచ్ మేనేజర్ అశోక్ మాట్లాడుతూ టూ వీలర్ విక్రయ రంగంలో సుజుకీకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఈ స్కూటీ అన్ని వర్గాలతో పాటు యువతకు ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని, డ్రైవింగ్‌కు సులువైందని నాణ్యతలో సాటిలేని స్కూటర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్‌బాబు, ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి (చినబాబు), కె.మన్మోహన్‌రామ్, సేల్స్ మేనేజర్ వెంకటేష్, బ్రాంచ్ మేనేజర్ అశోక్, అకౌంట్స్ జి.ఎం. రంగయ్య, సర్వీస్ ఏ.జి.ఎం భార్గవ్ పాల్గొన్నారు.
బైకులు ఢీకొని వ్యక్తి మృతి
బైకులు ఢీకొని వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment