రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తుని: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి గాయాలతో బయటపడ్డ ఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై తుని వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకెళితే..విజయనగరం జిల్లా వేపాడ మండలం, వేలుపర్తికి చెందిన గోకడ రవికుమార్(25), అనకాపల్లి జిల్లా రాంబిల్లికి చెందిన నాగిరెడ్డి కిల్లాడి ద్విచక్ర వాహనంపై అన్నవరం వచ్చారు. తిరుగు ప్రయాణంలో స్థానిక డీమార్టు సమీపంలో ఉన్న హవేలి రెస్టారెంటు దగ్గర నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న గోకడ రవికుమార్ అక్కడకక్కడే మృతి చెందగా అతనితో ప్రయాణిస్తున్న నాగిరెడ్డి కిల్లాడి గాయాలతో బయట పడ్డాడు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ ఘటనా స్థలిని పరిశీలించారు. యువకుడు మోటారు వాహనాన్ని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment