కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గోరక్షణపేట వద్ద వాటర్ వర్క్స్ మరమ్మత్తుల నిమిత్తం రోడ్డుకు అడ్డంగా భారీ పైపు పడేసి, డైవర్షన్ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. చీకటిలో దానిని గుర్తించని యువకుడు విజయ్ తన ద్విచక్ర వాహనంతో అర్ధరాత్రి ఆ పైపును ఢీకొట్టి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. యువకుడి మృతికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి, యువకుడు ప్రాణాలు కోల్పోతే ప్రజాప్రతినిధులు గానీ, కాంట్రాక్టర్ గానీ, అధికారులు గానీ రాకపోవడం దారుణమన్నారు. రోడ్డుకు అడ్డంగా పైపు పడేసి, కనీసం డైవర్షన్ కోసం హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. బారికేడ్లు పెట్టాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దారుణమని భరత్‌రామ్ అన్నారు.
పేరూరులో
22 అంగుళాల దూడ
అమలాపురం రూరల్: 22 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమలాపురం ముండలం పేరూరుకు చెందిన పితాని రాధాకృష్ణకు చెందిన ఆవుకు ఇటీవల ఈ దూడ పుట్టింది. బుడి బుడి అడుగులతో ముద్దొస్తున్న ఈ పుంగనూరు గిత్తను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు.
పుంగనూరు గిత్త
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment