పదిలం.. విజయం
రాయవరం: పాఠశాల స్థాయిలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యాభ్యాసం సాగించిన విద్యార్థి తొలిసారి ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలు పదో తరగతిలోనే. విద్యార్థుల భవితకు తొలిమెట్టు ఇదే. అలాంటి పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో ఎలా ప్రిపేర్ కావాలో నిపుణుల సూచనలు ఇలా..
చరిత్రలో సమాచార
విశ్లేషణ ముఖ్యం
నూతన విధానంలో పటాలకు 15 మార్కుల వెయిటేజీ ఉంటుంది. చరిత్ర నుంచి ఒకటి, రెండు పాఠ్యాంశాల్లోని పటాలు, భూగోళం నుంచి 6, 7 పాఠ్యాంశాల్లోని పటాలు చదవాలి. పటాల గుర్తింపు విషయంలో చరిత్రలో 3, 5, భూగోళంలో 1, 6, పౌరశాస్త్రంలో 4, 5, అర్థశాస్త్రంలో 3వ పాఠం అత్యంత ప్రధానమైనవి. 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే భూగోళంలో మూడు నాలుగు పాఠాల్లో విషయ అవగాహన కింద వస్తాయి. చరిత్రలో 2, 5 పాఠ్యాంశాల నుంచి అకడమిక్ స్టాండర్డ్–2 కింద ప్రశ్నలు ఇస్తారు. పౌరశాస్త్రంలో ప్రజాస్వామ్యం పాఠ్యాంశం నుంచి సమకాలీన అంశాల్లో ప్రతిస్పందన (అకడమిక్ స్టాండర్డ్–4) అనే అంశంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అర్థశాస్త్రంలో పట్టికలు, గ్రాఫ్‌లపై విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. పరీక్షలలో భారతదేశం మరియు ప్రపంచ పటం రెండు అవుట్‌లైన్ మ్యాప్‌లను తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది.
– కేఎస్‌వీ కృష్ణారెడ్డి, పాఠ్య పుస్తక రచయిత,
జెడ్పీహెచ్‌ఎస్, ఈతకోట, రావులపాలెం మండలం
రాజభాషలో..
ద్వితీయ భాష హిందీ పరీక్ష పత్రం 6 విభాగాలుగా ఉంటుంది. ఆ విభాగాల నుంచి 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొదటి భాగం నుంచి 12 మార్కులకు పాఠ్య పుస్తకంలోని వ్యాకరణ అంశాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. భాగం–2లో కాంప్రహెన్షన్ నుంచి 4 పేరాగ్రాఫ్‌లు ఇచ్చి ఒక్కో పేరాగ్రాఫ్‌కు 5 మార్కుల చొప్పున 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పేరాగ్రాఫ్‌లను చదివి బాగా అర్థం చేసుకుని రాయాలి. భాగం–3లో కవి, రచయితల గురించి బాగా చదివి అవగాహన పెంచుకుంటే 10 మార్కులు పొందవచ్చు. 19వ ప్రశ్నగా ‘దోహా’ మొదటి పాఠం నాలుగు పద్యాల్లో ఒకటి ఇస్తారు. లేఖలో చుట్టీ పత్ర్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది.
– తాహెర్ పాషా, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్‌ఎస్ (బాలికలు), రాజోలు
భౌతికశాస్త్రం.. భయం వద్దు
ఫిజిక్స్‌లో మొత్తం 8 పాఠ్యాంశాల్లో నాలుగు ఫిజిక్స్, నాలుగు కెమిస్ట్రీ పాఠ్యాంశాలున్నాయి. రెండు విభాగాల నుంచి 39 చొప్పున ఛాయిస్‌తో 78 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. కాంతి, ఆమ్లాలు–క్షారాలు పాఠాల నుంచి రెండు పటాలు వస్తాయి. నాలుగు మార్కులు స్కోర్ చేయవచ్చు. లోహాలు – అలోహాలు పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రయోగం వస్తుంది. విద్యుత్ పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది.
–అడబాల వీఎల్ నరసింహారావు,
సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్, జెడ్పీహెచ్‌ఎస్, చింతల్లంక, అయినవిల్లి మండలం
ఫ ప్రణాళికతో చదివితే మంచి మార్కులు
ఫ విద్యార్థులకు సబ్జెక్టు
నిపుణుల సూచనలు
పదిలం.. విజయం
పదిలం.. విజయం
పదిలం.. విజయం
Comments
Please login to add a commentAdd a comment