బాలిక కిడ్నాప్, అత్యాచారం
ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక (15)ను ఓ వివాహితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. అనాతవరం గ్రామానికి చెందిన వివాహితుడు పరమట దుర్గాప్రసాద్ (బులి చంటి) సోమవారం స్కూల్‌కు వెళ్తున్న ఆ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం అమలాపురం ఎర్రవంతెన సమీపంలో ఒక నివాసానికి తీసుకువెళ్లి అక్కడ ఆమైపె బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక కిడ్నాప్ అయిన విషయం ఆమె తల్లిదండ్రులు ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై డి.జ్వాలాసాగర్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన బులి చంటి ఆ బాలికను రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్రవంతెన వద్ద అనాతవరం వెళ్లే బస్సు ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment