సమస్యల పరిష్కారానికి కృషి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలోని విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు డి.వేణు మాధవరావు అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల కార్యవర్గ సమావేశం సోమవారం స్థానిక ఎన్జీవో హోమ్‌లో నిర్వహించారు. రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి పాపినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర సంఘ అధ్యక్షులు వేణుమాధవ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా మెడికల్ క్లెయిమ్స్ తదితర క్లెయిమ్స్ పరిష్కారంలో ఏఈఓ సంఘం శ్రమిస్తుందన్నారు. సంఘం అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికై న వేణుమాధవరావును విశ్రాంత ఏఈవోలు సన్మానించారు. 75 సంవత్సరాలు నిండిన విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సత్కరించారు. జిల్లా ప్రభుత్వ పెన్షన్‌సంఘం అధ్యక్షులు కేజీకే మూర్తి, నగర ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షులు మీసాల మాధవరావు
మాట్లాడారు.
అధ్యక్షుడిగా శాంతికుమార్
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విశ్రాంత వ్యవసాయ విస్తరణా అధికారుల సంఘం అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన జీఎం శాంతికుమార్‌ను కార్యవర్గం ఎన్నుకుంది. ప్రధాన కార్యదర్శిగా భీమవరానికి చెందిన కపర్దిని, కోశాధికారిగా ఎస్వీ శ్రీనివాస్, సహ అధ్యక్షుడిగా జి సింహాచలం, సంయుక్త కార్యదర్శిగా మురళిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment