జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న, భద్రత ప్రమాణాలు పాటించని ఇసుక రవాణా చేసే వాహనాలపై మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. ఇందుకు సంబంధించి మినిట్స్‌లో కమిటీ సమావేశం నిర్ణయం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్‌లలో నిర్దేశించుకున్న 10,39,350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 7,35,766 లభ్యత ఉందన్నారు. వేమగిరి– కడియపులంక 1 కార్యకలాపాలు లేనందు వల్ల రద్దు చేస్తున్నట్లు, జీడిగుంట 13 కోర్ట్ కేసు వలన పెండింగ్‌లో ఉందని, ములకల్లంక– కాటవరం 9 ర్యాంపు నిర్మాణంలో ఉన్న దృష్ట్యా కార్యకలాపాలు జరగటం లేదని తెలిపారు. ఏడు ప్రాంతాల్లో 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. ఫిబ్రవరి 13 నాటికి ఏడు రీచెస్ పబ్లిక్ హియరింగ్ పూర్తి అయిందని, సింగవరం, కాటవరం లో మార్చి 4 న, కుమారదేవరం మార్చి 5 న పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా కడియం, పెరవలి తీపర్రులో రెండు, నిడదవోలులో జీడిగుంట ఏ, బి ,పందలపర్రు డ్రాఫ్ట్ మైనింగ్ ప్లాన్ ఆమోదించామన్నారు.
ఫిర్యాదులు అందిన వాటికి నోటీసులు...
ఇసుక రవాణాపై పలు ఫిర్యాదులు అందాయని, నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. మోటార్ వాహన చట్టం ప్రకారం అటువంటి వాహనాలను గుర్తించి జరినామా విధించాలని స్పష్టం చేశారు. రీచ్‌ల నిర్వహణ ఏజెన్సీ ద్వారా ఆయా ప్రాంతాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా రహదారుల నిర్వహణ బాధ్యతలను చేపట్టాలని, వీటిని మినిట్స్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జేసీ ఎస్.చిన్న రాముడు, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, మైన్స్ ఏడీ ఫణిభూషణ్‌రెడి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment