ఏలూరు(మెట్రో): తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
వేగంగా ఫీజుల వసూలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీల ఫీజులు వసూలులో వేగం పెంచి, మార్చినాటికి టార్గెట్‌లు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పి.సుధాకర్ ఆదేశించారు. మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ కమిటీల కార్యదర్శులు, రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 50శాతం లోపు మార్కెట్ ఫీజు వసూలు చేసిన కార్యదర్శులు ఫీజులు వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. మార్కెట్‌యార్డుల్లో పెండింగ్ పనులును త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు సునీల్‌వినయ్, రాఘవేంద్రరావు, విశాలాక్షి, మార్కెట్ కమిటీ సెక్రటరీలు, ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment