
గుండెపోటుతో ఇంటలిజెన్స్ హెచ్‌సీ మృతి
కొవ్వూరు: ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఈ డేవిడ్‌రాజు (47) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు చాగల్లులోని స్వగృహంలో తెల్లవారు జామున గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిడదవోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి ఈసీజీ తీసిన వైద్యుల సూచనల మేరకు గుండెపోటుగా నిర్ధారించుకుని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతుండగా మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనకి భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఈయన స్వస్థలం ఏలూరు సమీపంలోని మముడూరు. ఉద్యోగ రీత్యా కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ చాగల్లులో స్వగృహం నిర్మించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment