ఏజెంట్ వేధింపులతో ఆత్మహత్య
మామిడికుదురు: ఏజెంట్ వేధింపుల వల్లే మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయికి ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. ఏజెంట్‌పై చర్య తీసుకోవాలంటూ మొగలికుదురుకు చెందిన నేదూరి సురేష్, రామలక్ష్మి దంపతులు కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ కృష్ణారావుకు ఈ నెల 15వ తేదీన ఫిర్యాదు చేశారు. మొగలికుదురుకు చెందిన నేదూరి తారక ముత్యాలరాము (24) ఈ నెల 13వ తేదీన కువైట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం సోమవారం స్వగ్రామం మొగలికుదురు చేరింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు, మృతుని అన్న ఫణీంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇవీ.. మొగలికుదురుకు చెందిన నేదూరి తారక ముత్యాలరాము బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కారు డ్రైవింగ్ కూడా చేసేవాడు. అతను గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన కువైట్ బయలు వెళ్లాడు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన కువైట్ చేరుకున్నాడు. మామిడికుదురు మండలం కొమరాడకు చెందిన ఏజెంట్ వలవల నాగరాజు ద్వారా అతను కువైట్ వెళ్లాడు. శేఠ్ తనను బాగా చూసుకుంటున్నాడని, తన సహ ఉద్యోగి, రూమ్‌మేట్ అయిన ఏజెంట్ వలవల నాగరాజు తరచు వేధింపులకు గురి చేస్తున్నాడని ఫోన్‌లో తల్లిదండ్రులకు చెప్పేవాడు. రెండు, మూడు సార్లు కొట్టాడు. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు మా అబ్బాయి తనతో మాట్లాడాడని తల్లి రామలక్ష్మి తెలిపారు. అదే రోజు సాయంత్రం 7.18 గంటలకు ఏజెంట్ నాగరాజు నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడని చెప్పారు. 7.50 గంటల సమయంలో ఏజెంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు కొమరాడ నుంచి వచ్చి మీ అబ్బాయి కనిపించడం లేదని, దీని వల్ల ఏజెంట్ నాగరాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడంటూ చెప్పారన్నారు. అప్పటి నుంచి తన కుమారుడి ఫోన్ పని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ తేదీ ఉదయం 2 గంటల సమయంలో కువైట్‌లో ఉంటున్న తమ బంధువు ద్వారా రాము ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందని ఆవేదనతో చెప్పారు. ఏజెంట్ వేధింపులే తమ కుమారుడి మృతికి కారణమని ఆరోపించారు. మరో వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురు కాకూడదని, ఏజెంట్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్, ఎస్పీకి
కుటుంబ సభ్యుల ఫిర్యాదు
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
ఏజెంట్ వేధింపులతో ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment