నూనె తయారీపై ‘తేలి’ సినిమా
సామర్లకోట: తమ తెలుకుల, గాండ్ల కులస్తులు అనాధిగా తయారు చేస్తున్న నూనె తయారీపై ‘తేలి’ అనే పేరుతో ప్రత్యేక చిత్రం త్వరలోనే రూపొందించనున్నట్టు సీనియర్ సినీనటుడు మొల్లెటి బాలాజీ తెలిపారు. స్థానిక పంచారామ క్షేత్రాన్ని దర్శించుకున్న సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులకు తన సినిమా అనుభవాలను వెల్లడించారు. 1983వ సంవత్సరంలో తాను ఓ ఆడది మగాడు చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సహంతో చిత్ర సీమలో అడుగుపెట్టానని తెలిపారు. మగమహారాజు, మంగమ్మగారి మనవడు వంటి చిత్రాలు గుర్తింపు తీసుకు వచ్చాయని వివరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి అనేక చిత్రాలల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడం ఆనందంగా ఉన్నదన్నారు. నూనె పుట్టుక, వినియోగం అన్ని వంటకాల్లోనూ, పూజల్లో నూనెకు అంతటి ప్రాధాన్యత దక్కడం వంటి అంశాలపై చిత్రంలో వివరించనున్నట్లు వివరించారు. త్వరలో త్రినేత్ర సినిమాలో కూడా తాను నటిస్తున్నట్లు చెప్పారు. బుచ్చిబాబు దర్శకత్వలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నట్లు చెప్పారు. వశిష్ట చిత్రంలో పోలీసు ఆఫీసరుగా నటిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల తన సీనీ జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు రెండు పర్యాయాలు సామర్లకోట భీమేశ్వరస్వామి వచ్చానన్నారు. సామర్లకోటలో 100 సంవత్పరాలకు పైబడి అంబటి సుబ్బన్న ఆయిల్ పరిశ్రమలో తయారు అవుతున్న నూనె రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి చేస్తున్న సేవలను బాలాజీ కొనియాడారు.
నృత్యకారుడికి అభినందన
తెలుకుల గాండ్ల కులానికి చెందిన అలమండ ప్రసాద్ అంతర్జాతీయంగా కూచిపూడి నృత్యంలో రాణించడంపై బాలాజీ అభినందించారు. దేశ, విదేశాల్లో ప్రసాద్ నృత్యాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం అభినందనీయమన్నారు. యోగం ఉంటేనే సామర్లకోటలోని యోగ లింగాన్ని దర్శించుకోగలుగుతామని అన్నారు.
సీనియర్ నటుడు బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment