హోరాహోరీగా ఆలిండియా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు మంగళవారం హోరాహోరీగా జరిగాయి. గుజరాత్ సెక్టార్, రాజస్థాన్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 11–2 స్కోర్‌తోను, పుదుచ్చేరి సెక్టార్, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 6–4 స్కోర్‌తోను, ఆర్‌ఎస్పీబి సిమ్లా, ఆర్‌ఎస్పీడి జైపూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్పీబి జైపూర్ 9–2 స్కోర్‌తోను విజయం సాఽధించాయి. ఆర్‌ఎస్పీబి ముంబయి, ఆర్‌ఎస్పీబి చైన్నె మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌ఎస్పీబి ముంబాయి 5–1స్కోర్‌తో, ఆంధ్రప్రదేశ్ సెక్టార్, గోవా సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ 23–0 స్కోర్‌తోను గెలుపొందగా జట్టులోని శ్రీనివాస్‌రావు 6, ఉదయ్‌కుమార్ 7 గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల విభాగంలో ఒడిశా సెక్టార్, ఢిల్లీ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒడిశా సెక్టార్ 16–0 స్కోర్ తోను, హర్యానా సెక్టార్, తెలంగాణ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా సెక్టార్ 18–0 స్కోర్‌తోను, బిహార్ సెక్టార్, ఉత్తరాఖండ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బిహార్ సెక్టార్ 7–1 స్కోర్‌తో విజయం సాధించాయి. మంగళవారం నిర్వహించిన మ్యాచ్‌లను కాకినాడ ఆర్‌డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డిఎస్‌డీఓ బి.శ్రీనివాస్ కుమార్‌లు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment