డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
అమలాపురం టౌన్: అమలాపురం ఎస్‌కేబీఆర్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అల్లవరం గ్రామానికి చెందిన వీరమల్లు హిమ రాజేశ్వరి అదృశ్యమైంది. ఆమె తాను చదువుతున్న కళాశాల నుంచి సాయంత్రం 3.10 గంటలకు వెళ్లిపోయినట్లు పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థిని తండ్రి వీరమల్లు దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హిమ రాజేశ్వరి ఎత్తు 5 అడుగులు, ఎస్‌కేబీఆర్ కళాశాల యూనిఫాం ధరించింది. తెలుగు రంగు కలిగి ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు 9440796561, పట్టణ ఎస్సై శ్రీనివాస్ 9848132305, విద్యార్థిని తండ్రి దుర్గా ప్రసాద్ 9949729616 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
యువతి ఆత్మహత్య
కాకినాడ క్రైం: తల్లిదండ్రులు మందలించారనే వేదనతో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే కాకినాడ సూర్యనారాయణపురంనకు చెందిన అనపాల అరుణ (24) స్థానిక వెంకీ రెసిడెన్సీలో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. ఈమె తరచుగా అప్పులు చేస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆవేదన చెంది ఈ నెల 16వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కాకినాడ త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో కుమార్తె అరుణ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగా మంగళవారం సాయంత్రం జగన్నాథపురం వంతెన కింద ఉన్న ఉప్పుటేరులో మృతదేహం కొట్టుకొచ్చింది.
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment