జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన మంగళవారం జెడ్పీ సమావేశపు మందిరంలో 1, 2, 4, 7 స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా 3వ స్థాయీ సంఘ సమావేశం వైఎస్ చైర్‌పర్సన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన, 5వ స్థాయీ సంఘ సమావేశం సంఘ చైర్‌పర్సన్, జెడ్పీటీసీ సభ్యురాలు రొంగల పద్మావతి, 6వ స్థాయీ సంఘ సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం నిర్వహించబోయే ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సమావేశం నిర్వహించినట్లు చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు వివరించారు. ఏవిధమైన శాఖాపరమైన సమీక్షలుగాని, తీర్మానాలుగాని చేయకుండా, ఆమోదించకుండా సమావేశాలు ముగించారు. ఈ సమావేశాలకు జిల్లా పరిషత్ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఆయా జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా ప్రజాపరిషత్ పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment