లిల్లీని పిండినల్లిపేస్తోంది
పెరవలి: తూర్పుగోదావరి జిల్లాలో లిల్లీపూల సాగు 300 ఎకరాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరుగుతోంది. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటలో వివిధ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరించారు.
ఆకుమచ్చ
లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకు వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండి వడలిపోతాయి.
నివారణ చర్యలు
ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పిండినల్లి (మీల్‌బగ్)
ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీదుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వలన తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లిపురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
మొగ్గ తొలుచు పురుగు
పుష్పగుచ్ఛాన్ని మొగ్గతొలిచే పురుగులు ఆశించి, గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోయి గుచ్ఛ అలాగే ఉండిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పురుగుల నివారణకు..
లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్‌డిజం గ్రాము లీటరు నీటికి పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే, రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు.
300 ఎకరాల్లో లిల్లీ పూల సాగు
దుష్ప్రభావం చూపుతున్న తెగుళ్లు
సస్యరక్షణ చర్యలు తప్పవంటున్న నిపుణులు
ఎరువుల యాజమాన్యం
సేంద్రియ ఎరువులతో పాటు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఇలా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి, ఎకరాకి 60 వేల నుంచి 70 వేలు పుష్పగుచ్చాలొచ్చి 3 నుండి 7 టన్నుల పూల దిగుబడి వస్తుంది.
లిల్లీని పిండినల్లిపేస్తోంది
లిల్లీని పిండినల్లిపేస్తోంది
లిల్లీని పిండినల్లిపేస్తోంది
లిల్లీని పిండినల్లిపేస్తోంది
లిల్లీని పిండినల్లిపేస్తోంది
లిల్లీని పిండినల్లిపేస్తోంది
Comments
Please login to add a commentAdd a comment