డిజిటల్ అసిస్టెంట్లకు రెండో రోజు శిక్షణ
సామర్లకోట: సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ రెండో రోజు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం(ఈటీసీ)లో బుధవారం కొనసాగింది. ఎన్‌ఐఆర్‌డీపీఆర్(హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని డిజిటల్ అసిస్టెంట్లకు సాంకేతిక నైపుణ్యంపై శిక్షణ ఇస్తున్నారు. గురువారంతో ఈ శిక్షణ ముగుస్తుంది. ప్రతి జిల్లా నుంచి నలుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఈ.కృష్ణమోహన్ తెలిపారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ రవిబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్వర్ శిక్షణ ఇస్తున్నారు.
యువకుడి అదృశ్యం
రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బైక్ లభ్యం
కొవ్వూరు: దొమ్మేరు గ్రామానికి చెందిన గగ్గురోతు సాయి తేజ(25) బుధవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి మోటార్ బైక్‌పై బయలుదేరిన అతడి వాహనాన్ని రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బంధువులు గుర్తించారు. గోదావరి నదిలో దూకాడా, లేక బైక్‌ను ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికై నా వెళ్లాడా అన్నది తెలియడం లేదని, అతడి సెల్‌ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఓ గేదెల ఫామ్‌లో సాయి తేజ పనిచేస్తున్నాడు. నిత్యం దొమ్మేరు నుంచి ఉదయాన్నే వెళ్లి, మళ్లీ 11 గంటల సమయానికి ఇంటికి తిరిగొస్తాడు. ఎప్పటిలాగే బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అతడు మళ్లీ తిరిగిరాలేదు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న బంధువులకు స్థానికుల ద్వారా బైక్ వివరాలు తెలిశాయి. ఈ క్రమంలో గోదావరి నదిలో జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు. సాయితేజ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment