రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి డీఐజీగా వెం
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌చార్జి డీఐజీగా భీమవరం జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కాకినాడ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్–1 ఆర్‌వీ రామారావు, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్–2 పీఎస్‌వీఎస్‌ఎస్ వీరభద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర్లు 2022–24 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. ఇక్కడ నుంచి భీమవరం జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లా డీఐజీగా ఉన్న బి.శివరామ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా కె.ఆనందరావుకు ఇన్‌చార్జి డీఐజీగా నియమించారు. అయితే అదనపు బాధ్యతలుగా ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఈయన పరిధిలోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment