ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే..
జేఎన్‌టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ ప్రసాద్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని జేఎన్‌టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ అన్నారు. జేఎన్‌టీయూ కాకినాడ వర్సిటీ ఆరో ఉప కులపతిగా బుధవారం మధ్యాహ్నం వీసీ చాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సీఎం, విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వర్సిటీలతో కొత్త కోర్సులపై ఒప్పందం, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనాంశాలు కీలకంగా ఉండేలా ప్రక్షాళన చేపడతానన్నారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ టాప్–100లో ఉంచడంతో పాటు, మెరుగైన ఎన్‌బీఐ ర్యాంకింగ్ సాధనకు కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులను స్టార్టప్స్, ఆవిష్కరణలకు ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం సెనెట్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, మాజీ వీసీ ప్రసాదరాజు, పద్మరాజు, మురళీకృష్ణ, డైరెక్టర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment