ఇసుక డ్రెడ్జింగ్‌ను అడ్డుకున్న కార్మికులు
కొవ్వూరు: భారీ డ్రెజ్జింగ్ యంత్రాలను వినియోగించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు తక్షణం నిలిపివేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట బోటు కార్మికులు ఐఎఫ్‌టీయు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. పౌర హక్కుల సంఘం నేతలు,ఐఎఫ్‌టీయు,దళి ప్రజా వేదిక నాయకులు ఈ ధర్నాకి సంఘీభావం ప్రకటించారు.గోదావరి నదిలో డ్రెజ్జింగ్ చేస్తున్న బోటును పట్టుకుని పోలీసులు,ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పగించామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ ప్రకటించారు.వేలాది మంది కార్మికుల ఉపాధి ని దెబ్బతీస్తూ నది అక్రమంగా డ్రెజ్జింగ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించు కోవడం లేదని దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు పేర్కోన్నారు.ఇసుక సేకరించే కార్మికులు చిన్న పడవల సాయంతో ఇసుక సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారని అన్నారు.పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలను వినియోగించి నది గర్భంలో డ్రెజ్జింగ్ చేయడం మూలంగా కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారని అన్నారు.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా నదిలో భారీ డ్రెజ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నరన్నారు.గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలను విస్మరించి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని,దీనిపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే గ్రీన్ ట్రిబ్యూనల్‌ను,హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.అక్రమం గా తవ్వుతున్న యంత్రాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు స్పందించి కేసులు నమోదు చేయకపోవడం బాధకరం అన్నారు.కార్మికులే స్వయంగా రంగంలోకి దిగి పట్టుకుని ఫిర్యాదు చేస్తే తప్పా స్పందించే పరిస్ధితి లేకపోవడం విచారకరం అన్నారు. చోళ్ల రాజు మాట్లాడుతూ కార్మికులు అర్ధరాత్రి భారీ బోటుని పట్టుకుని తెల్లవారేంత వరకు కాపలా ఉండి తీసుకోచ్చారన్నారు.అనంతరం నీటి పారుల శాఖ విభాగం ఆర్డీవోకి ఈ డ్రెజ్జింగ్ ప్రక్రియ పై రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చారు.ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ఇసుక పడవల కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని కోరారు.నది అక్రమంగా డ్రెజ్జింగ్‌ను ఆరికట్టడంతో పాటు డ్రెజ్జింగ్ ప్రక్రియ నిర్వహాకులపైన,ర్యాంపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ డ్రెజ్జింగ్ నిర్వహాకులపై చర్యలు తీసుకుంటామని, కార్మికులకు ఉపాధి కల్పనలో భాగంగా పడవల ర్యాంపులు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాణిసుస్మిత ప్రకటించారు.గోదావరి ఇసుక కార్మికుల సంఘం అధ్యక్షుడు చీరా అప్పారావు, ఇసుక కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
ఇసుక డ్రెడ్జింగ్‌ను అడ్డుకున్న కార్మికులు
Comments
Please login to add a commentAdd a comment