ఉన్నపళంగా ఆగిపోమన్నారు
మూడేళ్లుగా సంచార అంబులెన్స్‌లో పనిచేస్తున్నాం. సీనియారిటీ ఉంది కదా వేతనాలు పెరుగుతాయని భావించాం. కానీ ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒక్కసారిగా రోడ్డున పడ్డాం. ఏ పనిచేసుకుని మా కుటుంబాలను పోషించాలో అర్థం కావడం లేదు. – రాజేష్, డ్రైవర్
16వ తేదీ నుంచి రావద్దన్నారు
పాత సంస్థ కాంట్రాక్ట్ అయిపోయింది. 16వ తేదీ నుంచి ఉద్యోగాలకు రావద్దన్నారు. ముందస్తు సమాచారం లేకుండా టెర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు. జిల్లాలో 16 వాహనాల్లో 48 మంది పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగాలు చూపించి ఆదుకోవాలి. –రాజారత్నం, డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment