● కాలువ.. కను‘మురుగు’
ఈ చిత్రం చూస్తే కనుచూపు మేరంతా పచ్చని తివాచీ పరుచుకున్నట్టుంది కదూ! కానీ, ఇది అటువంటి అందాల చిత్రం ఎంతమాత్రం కాదు. ఇది తుల్యభాగ డ్రెయిన్. దీని వెనక పుడమి పుత్రుల కన్నీరుంది. కరప మండలంతో పాటు ఎగువన ఉన్న ఐదు మండలాల్లోని పొలాల్లో ముంపు, వరద నీరు ఈ డ్రెయిన్ ద్వారానే తాళ్లరేవు మండలం పటవల వద్ద సముద్రంలో కలవాలి. కానీ, ఈ డ్రెయిన్‌లో వేములవాడతో పాటు చాలాచోట్ల గుర్రపుడెక్క, తూటుకాడ విపరీతంగా పెరిగిపోయి, ఇలా నిండిపోయింది. దీంతో నీరు దిగే మార్గం లేక, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. – కరప
Comments
Please login to add a commentAdd a comment