సజావుగా ఇంటర్ పరీక్షలు
సీఎస్, డీఓలకు ఆర్‌జేడీ ఆదేశాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను జిల్లాలో సజావుగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ బోర్డు జోన్–1, 2 రీజినల్ జాయింట్ డైరక్టర్ (ఆర్‌జేడీ) ఐ.శారద ఆదేశించారు. ఎవరైనా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వర్తించనున్న చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు (డీఓ), కస్టోడియన్లు, స్క్వాడ్ సభ్యులకు స్థానిక ఎస్‌కేఆర్ వుమెన్స్ కళాశాలలో ఆదివారం ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 51 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్షల మెటీరియల్ అందరికీ అందజేశామన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి (ఆర్‌ఐఓ) ఎన్‌ఎస్‌ఎల్‌వీ నరసింహం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, రంపచోడవరం డివిజన్ల ప్రత్యేకాధికారి డి.కృష్ణకిశోర్, జిల్లా బల్క్ ఇన్‌చార్జిలు టీఎన్ వెంకటేశ్వర్లు, ఎస్.సత్యనారాయణ, ఎస్‌కే ఆలీముద్దీన్, బి.రామకృష్ణ పాల్గొన్నారు.
లోవలో భక్తుల సందడి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 7 వేల మంది భక్తులు క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలి పారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,21,365, పూజా టికెట్లకు రూ.75,520, కేశఖండన శాలకు రూ.9,840, వాహన పూజలకు రూ.2,810, కా టేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ. 60,032, విరాళాలు రూ.62,280 కలిపి మొత్తం రూ. 3,31,847 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment