ప్రాణం తీస్తున్న వేగం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీస్తున్న వేగం

Published Thu, Mar 13 2025 12:13 AM | Last Updated on Thu, Mar 13 2025 12:13 AM

ప్రాణ

ప్రాణం తీస్తున్న వేగం

ప్రాణాలు పోతుంటే బాధేస్తోంది

ఎంతో భవిష్యత్‌ ఉన్న కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల్లో కేవలం అతివేగంతో ప్రాణాలు కోల్పోవడాన్ని చూస్తున్నప్పుడు బాధేస్తోంది. ట్రాఫిక్‌ నిబంధనలపై, హెల్మెట్‌ ధారణపై, అతివేగం వద్దని, విధిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలని పోలీస్‌ శాఖ యువతకు నిత్యం కౌన్సెలింగ్‌లు ఇస్తోంది. ముఖ్యంగా యానాం –ఎదుర్లంక వారిధిపై జరగుతున్న యువకుల రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్నాం. యువకుల బైక్‌ల డ్రైవింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి, వారు అతివేగం తగ్గించేలా చర్యలు చేపడతాం.

టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, డీఎస్పీ,

అమలాపురం పోలీస్‌ సబ్‌ డివిజన్‌

అమలాపురం టౌన్‌: చదువుకుని ఉద్యోగాలు సాధించి ఉన్నతమైన జీవితాన్ని చవిచూడక ముందే... తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలు నెరవేరకుండానే కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైనా గమ్యాన్ని చేరుకుంటాం, అతి వేగంతో జరగరానిది ఏదైనా జరిగితే మన వెనక ఉన్న కుటుంబం ఏమైయిపోతుందనే కనీస ఆలోచన, ముందుచూపు లేకుండా యువకులు రోడ్లపై రయ్‌ రయ్‌ మంటూ బైక్‌లను నడుపుతున్నారు. గత ఏడాది కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అతి వేగంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 34 మంది వరకూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెలలోనే ఉమ్మడి జిల్లాలో ఏడుగురు వరకూ రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృత్యువాత పడ్డారు. ఐ.పోలవరం మండలం బాలయోగి వారధి (ఎదుర్లంక –యానాం వంతెన)పై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయంటే అతి వేగమే కారణం. మన జాగ్రత్తలో మనం ఉండి..ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే చాలా వరకూ రోడ్డు ప్రమాదాలు మన దరిచేరవు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో యువకులు రైడింగ్‌ మాదిరిగా బైక్‌ను అతివేగంగా నడపడం ఫ్యాషన్‌ అయిపోయింది. ఆధునాతన బైక్‌లను యమ స్పీడుగా నడుపుతూ మృత్యు కుహరాల్లోకి వెళుతున్నారు. యానాం –ద్రాక్షారామ రహదారిలో ఎకై ్సజ్‌ అధికారులు వెంబడించడంతో ఓ యువకుడు అతి వేగంతో వెళ్లి ఓ లారీని ఢీకొట్టి ప్రాణాలు విడిచాడు. పి.గన్నవరం మండల ఎల్‌.గన్నవరం శివారు జొన్నల్లంకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇలా చెప్పకుంటూ పోతే ఈ ఏడాదిలో అతివేగమనే అనర్థంతో అర్ధంతరంగా యువకులు ప్రాణాలు పొట్టన పెట్టుకున్న రోడ్డు ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. యువకులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న సమయంలో వారు కనీసం హెల్మెట్‌ ధరించకపోవడం గమనార్హం.

ప్రమాదాలకు కారణాలు అనేకం

యువకులు రోడ్డు ప్రమాదాల్లో బలి అయిపోతున్న సంఘటనలకు కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. అతి వేగం ప్రధాన కారమవుతుంటే దానికితోడు బైక్‌లతో రైడింగ్‌లకు దిగడం, మద్యం సేవించడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు లేకుండా వచ్చీ రానీ డ్రైవింగ్‌తో కొందరు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. యువకులను బైక్‌ల డ్రైవింగ్‌ పరంగా కంట్రోల్‌ చేయక పోవడంలో తల్లిదండ్రులు ప్రధాన కారకులవుతున్నారు. గొప్పల కోసం వెళ్లి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లోడికి ఖరీదైన, అధునాతన బైక్‌ కొనిచ్చామని ఆనందిస్తున్నారే తప్ప ఆ బైక్‌తో తమ బిడ్డ ఎన్ని తప్పిదాలు చేస్తున్నాడో ప్రాణాలు పోయాక గ్రహించి విలపిస్తున్నారు. డ్రైవింగ్‌లో నిష్ణాతులైన తర్వాతే బైక్‌ కొనిద్దామని ఆదిలోనే తల్లిదండ్రులు ఆలోచిస్తే ఇన్ని అనర్ధాలు జరవగవని పోలీసులు అంటున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా బైక్‌ డ్రైవింగ్‌పై తమ పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసుల కౌన్సెలింగ్‌లను పెడచెవిన పెడుతున్న యువత

జిల్లా పోలీస్‌ శాఖ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ముఖ్యంగా అతి వేగంతో వెళుతున్న యువతను నిరోధించేందుకు అనేక కౌన్సెలింగ్‌లు ఇస్తోంది. అలాగే ప్రతీ పట్టణం, గ్రామాల్లో హెల్మెట్‌ ధారణ ఎంత విలువనైదో, ప్రాణాలను ఎలా కాపాడుతుందో వివరిస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సరికొత్త ట్రాఫిక్‌ రూల్స్‌, పెరిగిన జరిమానాలపై యువకులను రోడ్డు చెంతే పోలీసులు ఆపి కౌన్సెలింగ్‌ ఇస్తున్నా వారు వాటిని పెడచెవిని పెడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబం ఎంత తల్లడిల్లుతుందో, ఎంత క్షోభను అనుభవిస్తుందో జిల్లా పోలీసులు వీడియోలు, ఆడియోలు, ఫ్లెక్సీలు ఎన్నో విడుదల చేస్తున్నా అవి కూడా యువకుల చెవులెక్కడం లేదు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను తీస్తోంది.

ర్యాష్‌ రైడింగ్‌, డ్రైవింగ్‌లతో యువత

కన్నవారికి కడుపు కోత

బైక్‌లపై విపరీతమైన వేగంతో ప్రయాణం

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడంతో ఘోర ప్రమాదాలు

తొలి తప్పిదం

తల్లిదండ్రులదే అంటున్న పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రాణం తీస్తున్న వేగం1
1/1

ప్రాణం తీస్తున్న వేగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement