గీత దాటేదే లే.. | - | Sakshi
Sakshi News home page

గీత దాటేదే లే..

Published Mon, Mar 24 2025 6:34 AM | Last Updated on Mon, Mar 24 2025 6:34 AM

గీత దాటేదే లే..

గీత దాటేదే లే..

సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

పిఠాపురం, గొల్లప్రోలుల్లో అవిశ్వాసానికి కుట్ర

బలం లేకపోయినా కుతంత్రాలు

ప్రలోభాలకు లొంగని

వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు

జనసేన నేతలకు చుక్కెదురు

పిఠాపురం: తుని మున్సిపాలిటీలో చేయాల్సిన అక్రమాలు, అరాచకాలన్నీ చేసి, చివరకు కేసులు కూడా పెట్టి, వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లను కూటమి నేతలు వేధించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు అదే కూటమి లోని జనసేన నేతలు పిఠాపురం, గొల్లప్రోలుపై కుట్రకు తెర తీశారు. అయితే, వారి ప్రయత్నాలను వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు ఆదిలోనే అడ్డుకున్నారు. డబ్బు, పలుకుబడి, అధికారం, ప్రలోభాలు, పైరవీలు.. ఇలా ఒకటీ రెండూ కాదు.. అస్త్రాలన్నీ ప్రయోగించినా.. ఉన్న అడ్డదారులన్నీ తొక్కినా.. తాము వైఎస్సార్‌ సీపీ శ్రీగీతశ్రీ దాటేదే లేదని ఆ పార్టీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. తాము వైఎస్సార్‌ సీపీ నుంచి ఫిరాయించేది లేదని, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీత మాట జవదాటేది లేదని రెండు పట్టణాల్లోనూ ఆ పార్టీ కౌన్సిలర్లు స్పష్టంగా చెబుతున్నారు. దీంతో, అడ్డదారిలో పురపాలన పగ్గాలు చేజిక్కించుకునేందుకు కుట్రలు పన్నిన జనసేన నేతలకు ఆదిలోనే చుక్కెదురైంది.

ఏం జరిగిందంటే..

పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉంది. అడ్డగోలు హామీలతో ప్రజలను బురిడీ కొట్టించి, గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కూటమి నేతలు.. ము ఖ్యంగా జనసేన నాయకులు ఈ రెండు పట్టణాలపై కన్ను వేశారు. వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లను ప్రలోభపె ట్టి, అవసరమైతే భయపెట్టి అడ్డదారిలో పురపాలనాధికారం దక్కించుకోవాలనే కుట్రకు తెర తీశారు. ఈ నే పథ్యంలో పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందు కు ఈ నెల 21 నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు.

బలాబలాలివీ..

ఫ పిఠాపురం మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గాను గతంలో ఒకరు మృతి చెందారు. దీంతో ఇక్కడ ప్రస్తుతం 29 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరు కాకుండా స్థానిక ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్‌ ఎక్స్‌ అఫీషి యో సభ్యులుగా పిఠాపురంలోనే ఓటు వేసే అవకాశాలున్నాయి. ఈ లెక్కన ఓటింగ్‌కు మొత్తం 32 మంది సభ్యులు ఉన్నారు. గత ఎన్నికల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యింది. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ నుంచి గండేపల్లి సూర్యావతిౖ పె చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమైపె అవిశ్వాసం పెట్టా లంటే మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేయాలి. అంటే కనీసం 22 మంది సంతకాలు అవసరం. ప్రస్తు తం కౌన్సిల్‌లో వైఎస్సార్‌ సీపీకి 18 మంది, జనసేనకు తాజాగా చేరిన ఆరుగురు కౌన్సిలర్లు, ఎక్స్‌ అఫీషియో ఓట్లతో కలిపి 9 మంది ఉన్నారు. టీడీపీకి చెందిన ఒక సభ్యుడు చనిపోగా.. ఆ పార్టీకి 5 ఓట్లు ఉన్నాయి.

ఫ గొల్లప్రోలు నగర పంచాయతీలో మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో వైఎస్సార్‌ సీపీకి ఏకంగా 19 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీకి ఒక సభ్యుడే ఉన్నాడు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఇటీవల కొంత మంది వైఎస్సార్‌ సీపీ నేతలు జనసేనలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గొల్లప్రోలు నుంచి ఒక్క కౌన్సిలర్‌ కూడా జనసేనలో చేరలేదు. ఒక కో ఆప్షన్‌ సభ్యుడు వెళ్లినా ఆయనకు ఓటు హక్కు లేదు. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ పదవి కూడా జనరల్‌ మహిళకు రిజర్వ్‌ చేశారు. ప్రస్తుతం గండేటి మంగతాయారు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమైపె అవిశ్వాసం పెట్టాలంటే 14 మంది సభ్యులు అవసరం. ప్రస్తుత తరుణంలో అది జరిగే పని కాదు.

బెడిసికొట్టిన జనసేన యత్నాలు

పిఠాపురంలో అవిశ్వాసానికి 22 మంది కౌన్సిలర్ల సంతకాలు కావాలి. జనసేన, టీడీపీ కౌన్సిలర్లను కలిపినా ఆ సంఖ్య 14 దాటడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ నుంచి మరో ఆరుగురిని తమ పార్టీలో చేర్చుకోవాలని జనసేన నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొంత మంది నాయకులు, కౌన్సిలర్లు ఇప్పటికే రహస్య సమావేశాలు జరిపినా చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎవ్వరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో పాటు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలబడటంతో జనసేన నేతలు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అధికార జులుం, తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి, నయానో భయానో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లను లొంగదీసుకునేందుకు వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా ఈ రెండు మున్సిపాలిటీలనూ తమ వశం చేసుకునేందుకు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జనసేన నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పిలిచి టికెట్టు ఇచ్చి, తమను కౌన్సిలర్లను చేసిన తల్లిలాంటి పార్టీని, ప్రతి విషయంలో తమకు అండగా ఉంటున్న నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత మాటను దాటి మరో పార్టీలోకి వెళ్లేది లేదంటూ వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. అధికారం ఉన్నా విశ్వాసాన్ని కొనలేరని ఆ పార్టీ నేతలు మరోసారి నిరూపించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement