లీక్‌పై అవగాహన అవసరం
పోచవరం వద్ద హెచ్‌పీసీఎల్, గెయిల్
ఇండియా ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
తాళ్లపూడి: ఆయిల్, గ్యాస్‌పైపు లైన్ వెళుతున్న భూములలో రైతులు ఏ విధమైన తవ్వకాలు చేయరాదని, పైప్‌లైన్ లీకయిన సమయంలో తమకు తక్షణం సమాచారం ఇవ్వాలని డిప్యుటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్. త్రినాథరావు అన్నారు. మండలంలోని పోచవరం వద్ద మంగళవారం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెపీసీఎల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్) ఆధ్వర్యంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. వైజాగ్ నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు భూమి లోపల పక్కపక్కనే వెళుతున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్, గెయిల్ గ్యాస్ పైప్‌లైన్‌లు ఉన్న ప్రాంతంలో ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు, ప్రజలకు, సమీపంలోని ఫ్యాక్టరీల సిబ్బందికి అవగాహన కల్పించారు. పంట పొలాల్లోంచి వెళ్లిన పైప్ లైన్ లీక్ అయితే ఆ ఏరియాలో వుండే ప్రతినిధికి సమాచారం అందిస్తే వెంటనే ఫైర్ ఇంజన్, పెట్రోల్‌ను నింపుకునే వాహనం, అంబులెన్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ప్రమాదాన్ని ఎలా నివారిస్తారో ప్రత్యక్షంగా చేసి చూపారు. లీకవుతున్న పెట్రోల్, మంటలను అదుపు చేసే విధానాలను, గాయపడిన వారిని తరలించడం తెలియజేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ పింటు నంది, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ వాణిధర్ రామన్, డీఎఫ్‌వో మార్టిన్ లూథర్ కింగ్, హెచ్‌పీసీఎల్ చీఫ్ మేనేజర్ పంకజ్ కుమార్, ఫ్యాక్టరీస్ ఇన్‌స్పెక్టర్ జి.స్వాతి, గెయిల్ డీజీఎం ఎం.భట్టాచార్య, ఆర్‌టీవో సీహెచ్ సంపత్ కుమార్, ఇన్‌చార్జి తహసీల్దార్ మోహన భారతి, తాళ్లపూడి పీహెచ్‌సీ వైధ్యాధికారి హారిక గుప్తా, పంచాయతీ కార్యదర్శి రామలక్ష్మి బీఆర్వో సాయి, గజ్జరం సర్పంచ్ గండి రాంబాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిట్టా శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment